Advertisementt

మహిళా గౌరవం vs వెండితెర క్రియేటివిటీ

Tue 07th Apr 2026 04:48 PM
kd the devil  మహిళా గౌరవం vs వెండితెర క్రియేటివిటీ
Nora Fatehi Dances with Sanjay Dutt in KD The Devil Song మహిళా గౌరవం vs వెండితెర క్రియేటివిటీ
Advertisement
Ads by CJ

సినిమాల్లో మ‌హిళ‌ల‌ను కించ‌ప‌రిచే పాట‌ల చిత్ర‌ణ‌ను మ‌హిళా క‌మీష‌న్ సీరియ‌స్ గా తీసుకుంటోంది. ఇప్పుడు నోరా ఫ‌తేహి, సంజ‌య్ ద‌త్ లాంటి పెద్ద స్టార్లపై క‌మిష‌న్ చ‌ర్య‌లు తీసుకోవ‌డం స‌ర్వ‌త్రా చ‌ర్చ‌కు తావిస్తోంది. పూర్తి వివ‌రాల్లోకి వెళితే..

కన్నడ చిత్రం KD - ది డెవిల్ సాంగ్ `సర్సే నిన్న సెరగా సర్సే` అశ్లీలత, అసభ్య విజువల్స్‌పై జాతీయ మహిళా కమిషన్ (NCW) తీవ్రంగా స్పందించింది. సృజనాత్మకత పేరుతో మహిళల గౌర‌వం, హుందాత‌నాన్ని కించపరచడం ఆమోదయోగ్యం కాదని పేర్కొంటూ ఈ వ్యవహారాన్ని కమిషన్ సుమోటోగా స్వీకరించింది. ఇప్పటికే ఈ కేసులో చిత్ర దర్శకుడు ప్రేమ్, రచయిత రకీబ్ ఆలం, నిర్మాతలు కమిషన్ ముందు హాజరై, సమాజంపై ఈ పాట ప్రతికూల ప్రభావం చూపిందని అంగీకరిస్తూ లిఖితపూర్వక క్షమాపణలు చెప్పారు. వివాదం ముదరడంతో ఈ పాటను ఇప్పటికే యూట్యూబ్ నుండి తొలగించారు. అంతేకాకుండా చిత్ర‌బృందం మూడు నెలల పాటు మహిళా సాధికారత కార్యక్రమాలు నిర్వహించి ఆ నివేదికను సమర్పించాలని కమిషన్ ఆదేశించింది.

మరోవైపు ఈ పాటలో నటించిన బాలీవుడ్ నటుల పట్ల కూడా మహిళా కమిషన్ కఠినంగా వ్యవహరిస్తోంది. గతంలో సమన్లు జారీ చేసినా హాజరుకానందున.. నటి నోరా ఫతేహికి ఏప్రిల్ 27న స్వయంగా హాజరు కావాలని చివరి అవకాశం ఇచ్చింది. నోరా తరఫు న్యాయవాది ప్రాతినిధ్యాన్ని కమిషన్ నిరాకరించింది. అలాగే నటుడు సంజయ్ దత్‌ను ఏప్రిల్ 8వ తేదీన విచారణకు రావాలని ఆదేశించింది. సినిమాల్లో గ్లామర్ పేరిట అశ్లీలతను ప్రోత్సహించే ధోరణికి అడ్డుకట్ట వేయాలని, కళాకారులు సమాజం పట్ల జవాబుదారీతనంతో ఉండాలని ఈ చర్య ద్వారా మహిళా కమిషన్ గట్టి సంకేతాన్ని పంపింది.

Nora Fatehi Dances with Sanjay Dutt in KD The Devil Song:

 KD The Devil Song

Tags:   KD THE DEVIL
Advertisement




Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ