Advertisementt

ప్లాప్ అన్నదే తెలియని బాక్సాఫీస్ విజేతలు!

Tue 07th Apr 2026 11:15 AM
ajamouli  ప్లాప్ అన్నదే తెలియని బాక్సాఫీస్ విజేతలు!
Successful Directors ప్లాప్ అన్నదే తెలియని బాక్సాఫీస్ విజేతలు!
Advertisement
Ads by CJ

ఒక విజయం అందుకోవడమే గగనమైన ఈ రోజుల్లో అపజయమెరుగని దర్శకులుగా కొనసాగడం అరుదైన రికార్డు. బాలీవుడ్‌లో రాజ్‌కుమార్ హిరానీ వంటి దిగ్గజ దర్శకుడి క్లీన్ రికార్డుకు `డంకీ`తో బ్రేక్ పడగా తాజాగా ఆదిత్య ధర్ `ధురందర్: ది రివెంజ్` చిత్రంతో హ్యాట్రిక్ సాధించి ఫ్లాప్ లేని దర్శకుడిగా అవతరించారు. మేకింగ్ స్టైల్ , కథా ఎంపికలో చూపిస్తోన్న‌ వైవిధ్యమే ఆదిత్య ధర్‌ను నేటి తరం సక్సెస్‌ఫుల్ డైరెక్టర్‌గా నిలబెట్టింది.

దక్షిణాది చిత్ర పరిశ్రమలో  రాజమౌళి ప్రస్థానం అప్రతిహతంగా సాగుతోంది. `స్టూడెంట్ నెం.1` నుండి  `ఆర్ ఆర్ ఆర్`  వరకు పరాజయమే లేని ఆయన  తదుపరి చిత్రాలతో ( వార‌ణాసి) గ్లోబల్ మార్కెట్‌ను శాసించే స్థాయికి చేరుకో నున్నారు. ఆ సినిమా విజ‌యం సాధిస్తే?  ప్ర‌పంచ దిగ్గ‌జ ద‌ర్శ‌కుల స‌ర‌స‌న రాజ‌మౌళి నిలుస్తారు. ఆయన బాటలోనే అనిల్ రావిపూడి కామెడీ మాస్ ఎలిమెంట్స్‌తో కమర్షియల్ సక్సెస్ మంత్రం జపిస్తున్నాడు. ఇప్ప‌టి వ‌ర‌కూ తీసిన ప్ర‌తీ సినిమా హిట్ అయింది. అలాగే ప్రశాంత్ నీల్, అట్లీ , నాగ అశ్విన్ వంటి దర్శకులు తమదైన విజన్ , సాంకేతిక నైపుణ్యంతో బాక్సాఫీస్ వద్ద కాసుల వర్షం కురిపిస్తూ డిజాస్టర్ లేని కెరీర్‌ను కొనసాగిస్తున్నారు.

ఈ దర్శకులందరి సక్సెస్ వెనుక వారి మేధస్సు, కఠిన శ్రమ , ప్రేక్షకుడి పల్స్ పట్టుకునే నైపుణ్యం స్పష్టంగా కనిపిస్తోంది. ఒక ఫ్లాప్ ఎదురైతే కెరీర్ తలకిందులయ్యే గ్లామర్ ప్రపంచంలో వరుస విజయాలతో తమ గ్రాఫ్‌ను పెంచుకుంటూ పోవడం  అభినందనీయం. భవిష్యత్తులో రాబోయే భారీ ప్రాజెక్టులతో వీరంతా సక్సెస్ స్ట్రీక్‌ను ఇలాగే కొనసాగించాలని భారతీయ సినిమా ఖ్యాతిని అంతర్జాతీయ స్థాయికి తీసుకెళ్లాలని సినీ అభిమానులు ఆకాంక్షిస్తున్నారు.

Successful Directors:

Top  Directors

Tags:   AJAMOULI
Advertisement




Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ