Advertisementt

భార్య ముందు వెన‌క్కి త‌గ్గిన హీరో!

Mon 06th Apr 2026 03:26 PM
abhishek bachchan  భార్య ముందు వెన‌క్కి త‌గ్గిన హీరో!
Abhishek Bachchan on Aishwarya భార్య ముందు వెన‌క్కి త‌గ్గిన హీరో!
Advertisement
Ads by CJ

బాలీవుడ్ స్టార్ కపుల్ అభిషేక్ బచ్చన్ - ఐశ్వర్యరాయ్ విడిపోతున్నారంటూ గత కొంతకాలంగా సోషల్ మీడియాలో వ‌స్తోన్న‌ పుకార్లకు అభిషేక్ తనదైన శైలిలో చెక్ పెట్టారు. ఇటీవల ఓ ఇంటర్వ్యూలో వైవాహిక బంధం గురించి ఆసక్తికర వ్యాఖ్యలు చేసారు. తమ మధ్య ఉన్నది కేవలం భార్యాభర్తల సంబంధం మాత్రమే కాదని అది ఒక పరిపూర్ణమైన భాగస్వామ్యం అని స్పష్టం చేశారు. తన తల్లి జయా బచ్చన్ తన తండ్రి అమితాబ్ కంటే పెద్ద స్టార్‌గా ఉన్నప్పుడే వారి వివాహం జరిగిందని గుర్తు చేస్తూ ఇంట్లో పురుషాధిక్యత ఉండే వాతావరణంలో తాను పెరగలేదని అభిషేక్ వివరించారు.

ఐశ్వర్యతో తన ప్రయాణం స్నేహంతో మొదలైందని అదే తమ మధ్య గౌరవాన్ని అవగాహనను పెంచిందన్నారు. కెరీర్ పరంగా ఐశ్వర్య తనకంటే ఎక్కువ సక్సెస్ సాధించినా తాను ఎప్పుడూ అసూయ పడలేదని ఒకరి గెలుపును మరొకరు సెలబ్రేట్ చేసుకోవడమే తమ బంధంలోని గొప్పతనమని వెల్లడించారు. `నా కంటే ఐశ్వర్యరాయ్ గొప్పది అని ఆయన గర్వంగా చెబుతాన‌న్నారు. పనుల పంపకాల్లో కానీ, నిర్ణయాల్లో కానీ తామిద్దరం కలిసి ఆలోచించి ముందుకెళ్తామన్నారు. ఒకరినొకరు గౌరవించుకోవడమే తమ విజయ రహస్యమని తెలిపారు.

ఈ వ్యాఖ్యలతో వీరిద్దరి మధ్య విభేదాలు ఉన్నాయంటూ  వ‌స్తోన్న‌ వార్తలకు పరోక్షంగా తెరపడినట్లయింది. తమ వ్యక్తిగత జీవితాన్ని రహస్యంగా ఉంచడానికే ప్రాధాన్యత ఇస్తామ‌న్నారు. 2007లో వివాహం చేసుకున్న ఈ జంటకు ఆరాధ్య అనే కుమార్తె ఉన్న సంగతి తెలిసిందే. అభిషేక్ మాటలు విన్న అభిమానులు, బచ్చన్ ఫ్యామిలీలో అంతా సవ్యంగానే ఉందంటూ హర్షం వ్యక్తం చేస్తున్నారు. ప్ర‌స్తుతం అభిషేక్ బ‌చ్చ‌న్ షారుక్ ఖాన్‌తో కలిసి కింగ్ చిత్రంలో న‌టిస్తోన్న సంగ‌తి తెలిసిందే.

Abhishek Bachchan on Aishwarya:

Abhishek Bachchan opens up on co-parenting with Aishwarya Rai Bachchan

Tags:   ABHISHEK BACHCHAN
Advertisement




Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ