గత శుక్రవారం లాంగ్ వీకెండ్ ని క్యాష్ చేసుకుందామని థియేటర్స్ లో దిగిన బైకర్, రాకాస చిత్రాలు, అలాగే మరికొన్ని చిన్న సినిమాలు ప్రేక్షకులను ఫుల్ గా ఇంప్రెస్స్ చేశాయా. గత వారం విడుదలైన బ్యాండ్ మేళం లాంటి చిత్రాలు చిన్నబోగా ఈ వారం ఇంట్రెస్టింగ్ గా కనిపించిన బైకర్, రాకాస అయినా ప్రేక్షకులను ఇంప్రెస్స్ చేస్తాయని ఆడియన్స్ ఆశ పడ్డారు.
శర్వానంద్ బైకర్, నిహారిక ల రాకాస లపై మంచి బజ్ ఉంది. అంతలా రెండు సినిమా చిత్ర బృందాలు ఆ సినిమాలను ప్రమోట్ చేసారు. శర్వానంద్ ఖచ్చితంగా బైకర్ తో హిట్ కొడతాడని అనుకున్నారు. మరోపక్క నిహారిక ప్రొడక్షన్ మూవీ అంటే హిట్ పక్కా అనే నమ్మకం ప్రేక్షకుల్లోనూ ఉంది.
అయితే శుక్రవారం విడుదలైన ఈ రెండు చిత్రాలకు ప్రేక్షకుల నుంచి, క్రిటిక్స్ నుంచి ఫుల్ మార్క్ లు పడలేదు, మిక్స్డ్ రెస్పాన్స్ చూపించారు. బైకర్ కన్నా రాకాస బావుంది అని ఫ్యామిలీ ఆడియన్స్ అంటుంటే.. రాకాస కన్నా బైకర్ బావుంది అని యూత్ చెబుతుంది. అలా రెండు వర్గాల ప్రేక్షకులకు ఆ రెండు సినిమాలు రీచ్ అయ్యాయి.
అలాగే లాంగ్ వీకెండ్ లోను బైకర్, రాకాస రెండు చిత్రాలు స్ట్రాంగ్ నెంబర్లు నమోదు చేసాయి. అయితే ఇప్పుడు ఈ రెండు చిత్రాలు సోమవారం నుంచి టఫ్ కాంపిటీషన్ ను ఎదుర్కోబోతున్నాయి. అంటే వీక్ డే ఎక్సామ్ పాస్ అయితేనే రెండు సినిమాలు హిట్ లిస్ట్ లోకి వెళతాయి. చూద్దాం సోమవారం బైకర్, రాకాస పెరఫార్మెన్సు ఎలా ఉంటుందో అనేది.




అజంతా శిల్పంలా అలియా భట్ 
Loading..