Loading...
ఆంగ్ల హోమ్ >> తెలుగు వార్తలు >> Ram Charan apologises to Jasprit Bumrah

క్రికెట్ అభిమానుల కు రామ్ చరణ్ సారీ

Ram Charan apologises to Jasprit Bumrah


పెద్ది ప్రమోషన్స్ లో మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ చాలా బిజీగా వున్నారు. ముంబై ప్రమోషన్స్ తర్వాత నిన్న భోపాల్ లో జరిగిన పెద్ది ఈవెంట్ లో రామ్ చరణ్ కనిపించారు. పెద్ధి మ్యూజికల్ నైట్ లో రామ్ చరణ్ అలాగే రెహమాన్ లైవ్ మ్యూజిక్ కోసం పెద్ద ఎత్తున అభిమానులు పాల్గొన్నారు .

అనుకున్నదాని కన్నా పెద్ది భోపాల్ ఈవెంట్ సక్సెస్ అయ్యింది. అయితే ఈ ఈవెంట్ లో యాంకర్ అడిగిన ప్రశ్నకు రామ్ చరణ్ సమాధానమిస్తూ.. బుమ్రాను క్రికెటర్ అనబోయి ఫుట్ బాల్ ప్లేయర్ అని సంబోధించారు. నేను బుమ్రాకు చాలా పెద్ద ఫ్యాన్ ని. ఆయన మన దేశంలో ఫుట్బాల్ ఆటను మరింత ముందుకు తీసుకెళ్తున్నారు అంటూ కామెంట్స్ చెయ్యడంతో..  ఒక్కసారిగా స్టేజ్ పై పెద్ది టీమ్ తో పాటుగా  అక్కడే ఉన్న ఆడియన్స్ అందరూ షాక్ అయ్యారు.

దానితో రామ్ చరణ్ వీడియో క్లిప్ ని సోషల్ మీడియాలో ట్రెండ్ చేస్తూ ట్రోల్ చెయ్యడంతో రామ్ చరణ్ వెంటనే పెద్ది మూవీ ప్రమోషన్స్‌లో జరిగిన ఈ పొరపాటుకు చింతిస్తూ, బుమ్రా ఆట పట్ల తనకు ఎంతో గౌరవం ఉందని, అలా మాట్లాడినందుకు క్షమించమని చరణ్ స్పష్టం చేశారు.

Ram Charan ,