కోలీవుడ్ స్టార్ హీరో ధనుష్ తో దర్శకుడు, నయనతార భర్త విగ్నేష్ శివన్ కి మంచి ఫ్రెండ్ షిప్ ఉండేది. కానీ ఇప్పుడా ఫ్రెండ్ షిప్ కనిపించడం లేదు. నయనతార-విగ్నేష్ శివన్ ల డాక్యుమెంటరీపై ధనుష్ కేసు వేశారు. తన సినిమాలోని సీన్స్ వాడుకున్నారంటూ కోర్టుకెక్కడం ఇదంతా అప్పట్లో హాట్ టాపిక్ అయ్యింది.
తాజాగా విగ్నేష్ శివన్ డైరెక్ట్ చేసిన LIK విడుదలకు సిద్దమైన నేపథ్యంలో విగ్నేష్ శివన్ ఓ ఇంటర్వ్యూలో ధనుష్ నాకు తండ్రి వంటి వాడు, కానీ మా మధ్యన దూరం ఎందుకు పెరిగిందో అర్ధం కావడం లేదు అంటూ చేసిన కామెంట్స్ వైరల్ అవుతున్నాయి.
నాకు ధనుష్ అంటే చాలా ఇష్టం. ధనుష్ ది జులై 28 పుట్టినరోజు. అనుకోకుండా అదే జులై 28 న మా నాన్న చనిపోయారు. దానివల్ల ధనుష్ లోనే నాన్నను చూసుకున్నా. నిజంగా నేను ఈరోజు ఈ స్థాయిలో ఉన్నానంటే దానికి ముఖ్య కారణం ఆయనే. వి.ఐ.పి మూవీ షూట్ సమయంలో రెండేళ్లు ఆయనతోనే ఉన్నా. ధనుష్ తిన్నాకే తినేవాడిని. ఒకప్పుడు మా మధ్య అంతటి అనుబంధం ఉండేది.
కానీ ఇప్పుడు ఆ స్నేహం లేదు. ఆలా జరిగినందుకు నేనెంతో సిగ్గుపడుతున్నా. ఇద్దరు వ్యక్తుల మధ్య ఏదైనా సమస్య ఉంటే కూర్చొని మాట్లాడుకుని పరిష్కరించుకోవచ్చు. కానీ మా మధ్యన అలాంటిది ఏమీ జరగలేదు. దూరం ఎందుకు వచ్చిందో తెలియడం లేదు అంటూ విగ్నేష్ శివన్ చెప్పుకొచ్చాడు.




నిర్మాతగా మెగా డాటర్ సక్సెస్ 
Loading..