నటిగా కొన్ని సినిమాలు చేసి ఆతర్వాత పెద్దలు కుదిర్చిన వివాహం చేసుకుని.. ఆ వివాహ బంధంలో ఇమడలేక విడాకులు తీసుకుని నటనవైపు వెళుతుంది అనుకున్న వారికి షాకిస్తూ ప్రొడ్యూసర్ అవతారమెత్తిన మెగా డాటర్ నిహారిక కొణిదెల నిర్మాతగా చాలా తక్కువ సమయంలోనే సూపర్ సక్సెస్ అయ్యింది.
కమిటీ కుర్రాళ్ళు అంటూ ఎలాంటి ఫేమ్ లేని కొత్త వాళ్లతో హిట్ కొట్టి అవార్డులు రివార్డులు అందుకున్న నిహారిక తాజాగా రాకాస అంటూ కొత్త సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చింది. సినిమా తియ్యడానికి చిత్ర బృందం ఎంతగా కష్టపడిందో.. అంతగా నిహారిక, హీరో సంగీత్ శోభన్, హీరోయిన్ కలిసి ప్రమోషన్స్ తో కష్టపడ్డారు.
రీసెంట్ గా విడుదలైన రాకాస చిత్రానికి క్రిటిక్స్ మిక్స్డ్ రెస్పాన్స్ చూపించినా ఆడియన్స్ రాకాస చిత్రాన్ని ఆదరిస్తున్నారు. ఈ వీకెండ్ లో రాకాస చిత్రానికి హౌస్ ఫుల్స్ పడుతున్నాయి. అయినప్పటికి నిహారిక అండ్ టీమ్ ఇంకా ఇంకా సినిమాని ప్రమోట్ చేస్తున్నారు. నిర్మాతగా పింక్ ఎలిఫెంట్ పిక్చర్స్ పై నిహారిక బ్యాక్ టు బ్యాక్ సక్సెస్ సాధించింది.
మరి నటన కు నిహారిక ఇక గుడ్ బై చెప్పేసి నిర్మాతగా సెటిల్ అవుతుందేమో చూడాలి. ఇకపై నిహారిక నుంచి రాబోయే సినిమాలకు ఎంత క్రేజ్ ఉంటుందో అనేది జస్ట్ వెయిట్ అండ్ వాచ్.




శిల్పా శెట్టి రెస్టారెంట్ కి వెళ్తే ఆస్తులు అమ్ముకోవాలి
Loading..