Advertisementt

లెనిన్ - కాంప్రమైజ్ అయ్యేదేలే

Sun 05th Apr 2026 11:07 AM
lenin  లెనిన్ - కాంప్రమైజ్ అయ్యేదేలే
Lenin shooting update లెనిన్ - కాంప్రమైజ్ అయ్యేదేలే
Advertisement
Ads by CJ

అఖిల్ అక్కినేని ఈసారి లెనిన్ చిత్రం తో పవర్ ఫుల్ కమ్ బ్యాక్ ఇవ్వాల్సిందే. లెనిన్ చిత్రం హిట్ అవడం అనేది అఖిల్ కెరీర్ కి చాలా ఇంపార్టెంట్ కూడా.. అందుకే లెనిన్ దర్శకుడు మురళి కిషోర్ అబ్బూరి ఎక్కడా కాంప్రమైజ్ అవ్వకుండా లెనిన్ చిత్రాన్ని  తెరకెక్కిస్తున్నారు. సాటిస్ఫేక్షన్ లేని సీన్స్ రీ షూట్ షూట్ చేయడానికి కూడా వెనుకాడడం లేదట.

అఖిల్ అలాగే హీరోయిన్ భాగ్య శ్రీ బోర్సే లపై ఓ సీక్వెన్స్ చిత్రీకరణ తర్వాత అవుట్ ఫుట్ విషయంలో అసలు కాంప్రమైజ్ అవ్వకూడదనే ఉద్దేశ్యంతో ఈ సీక్వెన్స్ ను భారీ స్థాయిలో మళ్ళీ రీషూట్ చేయాలని లెనిన్ చిత్ర బృందం భావిస్తున్నట్లు తెలుస్తోంది. ఇక లెనిన్ ఇంటర్వెల్ ఎపిసోడ్ వేరే లెవల్ లో ఉండబోతున్నట్లుగా చిత్రం బృందం చెబుతున్న మాట.

లెనిన్ లో అఖిల్ కి ఓ చిన్న లోపం పెట్టాడట దర్శకుడు. ఆ లోపం తో ఆ పాత్ర పడే ఇబ్బందులు, హీరో పాత్ర చుట్టూ నడిచే డ్రామా చాలా ఇంట్రెస్టింగ్ గా ఉండబోతుందని తెలుస్తుంది. పల్లెటూరి ప్రేమ, కక్షల నేపథ్యంలో లెనిన్ చిత్రం రూపొందుతుంది. ఈ చిత్రాన్ని జూన్ 26 న విడుదల చేస్తున్నట్లుగా మేకర్స్ రీసెంట్ గానే ప్రకటించారు.

Lenin shooting update:

Akhil Lenin movie

Tags:   LENIN
Advertisement




Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ