నేషనల్ క్రష్ రష్మిక మందన్న పాన్ ఇండియా లో టాప్ హీరోయిన్ గా మారిపోయింది. క్రేజీగా హిందీ, తెలుగు, తమిళ చిత్రాలతో క్షణం తీరిక లేకుండా గడుపుతున్న రష్మిక కు ఈ ఏడాది ఏప్రిల్ 5 బర్త్ డే చాలా స్పెషల్. ఎందుకంటే తను ప్రేమించిన హీరో విజయ్ దేవరకొండ తో ఈ ఏడాది ఫిబ్రవరి 26 న ఏడడుగులు నడిచి దేవరకొండ రష్మిక గా మారిపోయింది.
రష్మిక-విజయ్ దేవరకొండ ల పెళ్లి తంతు ఇప్పటికి సోషల్ మీడియాలో హైలెట్ అవుతూనే ఉంది. ఎంత టాప్ హీరోయిన్ అయినా దేవరకొండ ఫ్యామిలీ సంప్రాదయాలను పెళ్లి తర్వాత చక్కగా నిర్వహించిన రష్మిక ఈ ఏడాది తన బర్త్ డే ని భర్త విజయ్ దేవరకొండ ఫ్యామిలీతో సెలెబ్రేట్ చేసుకుంటుంది. ఎప్పుడు విజయ్ తో కలిసి సీక్రెట్ వెకేషన్ కి వెళ్లే రష్మిక ఈసారి అఫీషియల్ గా విజయ్ తో బర్త్ డే ని సెలెబ్రేట్ చేసుకుంటుంది.
వ్యక్తిగతంగా జీవితంలో సెటిల్ అయిన రష్మిక కు అటు సినిమా ఇండస్ట్రీ నుంచి బర్త్ డే విషెస్ అందుతున్నాయి. అంతేకాదు ఆమె నటిస్తున్న సినిమాల నుంచి రష్మిక ను విష్ చేస్తూ లుక్స్ వదులుతున్నారు మేకర్స్. మరి నిజంగా ఈ రోజు ఏప్రిల్ 5 రష్మిక కు నిజంగా చాలా స్పెషల్ డే అన్నమాట.




ఫౌజీ నుంచి ప్రభాస్ లుక్ లీక్ 

Loading..