Advertisementt

ధురంధర్ 3 పై ఆదిత్య ధర్ సమాధానం

Sat 04th Apr 2026 09:20 PM
dhurandhar  ధురంధర్ 3 పై ఆదిత్య ధర్ సమాధానం
Dhurandhar 2-Aditya Dhar ధురంధర్ 3 పై ఆదిత్య ధర్ సమాధానం
Advertisement
Ads by CJ

ధురంధర్, ధురంధర్ 2 ద రివేంజ్ చిత్రాలు సృష్టించిన, సృష్టిస్తున్న రికార్డులు అన్ని ఇన్ని కావు. పార్ట్ 1 కి మించి ధురంధర్ 2 బ్లాక్ బస్టర్ అయ్యింది. ధురంధర్ 2 లో ఇండియన్ ఏజెంట్ గా పాకిస్తాన్ కరాచిలోని లియోరిలో విధ్వంశం సృష్టించి ఇండియాకి తిరిగొచ్చిన రణ్వీర్ సింగ్ ఇండియా లో తల్లిని, చెల్లిని కలవకుండా వెళ్లిపోవడం ప్రేక్షకులకు అసంతృప్తిని ఇచ్చింది.

అంతేకాదు కరాచీలోనే తన భార్య పిల్లాడిని వదిలెయ్యడం కూడా ప్రేక్షకులలో ఎక్కడో అసంతృప్తి కనిపిస్తుంది. అయితే ధురంధర్ 3 ఉంటుంది, అందులో ఈ ప్రశ్నలకు సమాధానాలు దొరుకుతాయని అనుకున్నా ఆదిత్య ధర్ మాత్రం ధురంధర్ 3 పై ఎలాంటి క్లారిటీ ఇవ్వట్లేదు. రీసెంట్ గా ధురంధర్ 2 ఉంటుందా అంటే ఏమో చెప్పలేను అన్నారు తప్ప.

ధురంధర్ 3 ఖచ్చితంగా ఉంటుంది అని చెప్పకుండా కన్ఫ్యూజన్ లో పెట్టారు. దర్శకుడు ఆదిత్య ధర్ తలచుకోవాలె కానీ ధురంధర్ 3 కథకు సరిపోయే కంటెంట్ ఉంది. పాకిస్తాన్ నుంచి రణ్వీర్ సింగ్ భార్య పిల్లలను తెచ్చుకోవడం, ఇండియాలో తల్లిని చెల్లి ని కలవడం, మళ్లీ సైనికుడిగా మారి ఇండియాని కాపాడడం ఇలా ఎన్నోఅంశాలు పార్ట్ 3 కోసం ఉన్నాయి అనేది చాలామంది ధురంధర్ అభిమానుల అభిప్రాయం.

మరి ఆదిత్య ధర్ ధురంధర్ 3 పై పెద్దగా ఆసక్తి చూపించడం లేదు. ఆయన తన నెక్స్ట్ సినిమా పై మాత్రం అందరిలో విపరీతమైన క్యూరియాసిటీ ఉంది.

Dhurandhar 2-Aditya Dhar:

Director Aditya Dhar

Tags:   DHURANDHAR
Advertisement




Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ