Advertisementt

రామాయణ - రణబీర్ లో అది మిస్ అయ్యింది

Sat 04th Apr 2026 08:30 PM
ramayana  రామాయణ - రణబీర్ లో అది మిస్ అయ్యింది
Sunil Lahri has expressed disappointment with the Ramayana teaser రామాయణ - రణబీర్ లో అది మిస్ అయ్యింది
Advertisement
Ads by CJ

బాలీవుడ్ లో భారీ బడ్జెట్ తో నితీష్ తివారి తెరకెక్కిస్తున్న రామాయణ చిత్రం పై ఎంత హైప్ ఉంది అనేది పక్కన పెడితే.. తాజాగా విడుదలైన రామాయణ టీజర్ పై మిక్స్డ్ రెస్పాన్స్ కనిపిస్తుంది. రామాయణ గ్రాఫిక్స్ బాలేదు అని, రాముడిగా రణబీర్ సూట్ అవ్వలేదు అంటూ సోషల్ మీడియాలో కామెంట్స్ కనిపిస్తే..

తాజాగా సీనియర్ నటుడు సునీల్ లహ్రీ రామాయణంలో రణబీర్ కపూర్ రాముడి కేరెక్టర్ పై చేసిన కామెంట్స్ తెగ వైరల్ అవుతున్నాయి. రూ.4000 కోట్లు ఖర్చు పెడితే సరిపోదు, సినిమాలో ఎమోషనల్ సీన్స్ ప్రేక్షకులకు కనెక్ట్ అవ్వాలి. రామాయణకు సంబంధించిన ఓ వీడియో చూశా.. అందులో ఓ అంశం నన్నెంతో ఇబ్బంది పెట్టింది. 

ఆ టీజర్ లో అనుకున్నంతగా ఎమోషన్స్ పండలేదు. ఎమోషన్స్ సరిగ్గా చూపించనప్పుడు.. రూ.4000 కోట్లు ఖర్చు పెట్టి సినిమా చేసినా ఉపయోగం ఉండదు. ఆ సినిమా సరిగ్గా ఆడదు. రాముడి గెటప్ లో రణబీర్ లో ఆ సున్నితం, అమాయకత్వం కనిపించడం లేదు. రణబీర్ కాస్త కఠినంగా కనిపిస్తున్నారు అని చెప్పిన సునీల్ లహ్రీ, రణబీర్ కపూర్ రాముడి కంటే కూడా లక్ష్మణుడు, భరతుడి పాత్రలకు సూట్ అవుతాడంటా చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. 

Sunil Lahri has expressed disappointment with the Ramayana teaser:

Ranbir Kapoor Lacks Innocence, Looks Harsh As Lord Ram

Tags:   RAMAYANA
Advertisement




Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ