సినిమాల్లో హీరోగా ఎదిగేందుకు ఎంతగా కష్టపడి స్టార్ హీరోగా ఎదుగుతున్నారో.. రాజకీయాల్లో సక్సెస్ అవ్వడానికి అంతే కష్టపడాల్సిన సమయమిది. గతంలో సీనియర్ ఎన్టీఆర్, ఎంజీఆర్ లాంటి వాళ్ళు రాగానే పొలిటికల్ గా నిలదొక్కుకున్నారు అంటే అప్పటి ప్రజల ఆలోచన తీరు వేరు. కానీ ఇప్పుడు పొలిటికల్ పార్టీల ఎత్తులు, ప్రజల చిత్తుల నడుమ రాజకీయంగా ఎదగడం అంటే సినిమాల్లో హీరోగా ఎదిగినంత ఈజీ కాదు అనేది చాలామంది నిరూపించారు.
ఇప్పుడు కోలీవుడ్ స్టార్ హీరో విజయ్ పరిస్థితి కూడా అదే. సినిమాల్లో ఉన్న క్రేజ్ ని విజయ్ పొలిటికల్ గా లాభం పొందాలని డిసైడ్ అయ్యి TVK పార్టీ పెట్టి ఈ తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేస్తున్నారు. పార్టీ నుంచి రెండు నియోజక వర్గాల్లో పోటీ చేస్తున్న విజయ్ మిగతా నియోజకవర్గాల్లో అభ్యర్థుల ఎంపిక సవాల్ గా మారింది.
కొన్ని చోట్ల విజయ్ నిలబెడుతున్న అభ్యర్థులు మరీ వీక్ గా కనిపిస్తున్నారు. అభిమాన సంఘాల అధ్యక్షులు, డ్రైవర్ అంటూ విజయ్ స్ట్రాటజీ చూపిస్తున్నా అది ఎంతవరకు వర్కౌట్ అవుతుందో తెలియదు. మరోపక్క విజయ్ ని సమస్యలు చుట్టుముడుతున్నాయి. ఇక ప్రజల్లోకి వెళ్లి తానొక్కడే ఎంతగా పార్టీ ని ప్రమోట్ చేసినా, అది ఎంతవరకు రీచ్ అవుతుందో తెలియదు.
సభలు, ర్యాలీలు అంటూ విజయ్ నిత్యం ప్రజల్లోనే ఉంటున్నారు. ప్రస్తుతం తమిళనాడు గవర్నమెంట్ లో ఉన్న స్టాలిన్ పార్టీ స్ట్రాంగ్ గా ఉంది, మరోపక్క బిజెపి, అన్నాడీఎంకే కూటమి కట్టి గట్టిగా పని చేస్తున్నాయి. మరి ఈ తమిళ అసెంబ్లీ ఎన్నికల్లో విజయ్ ఒంటరిపోరు ఎంతవరకు వర్కౌట్ వవుతుందో అనేది జస్ట్ వెయిట్ అండ్ సి.





కన్ఫ్యూజన్ లో పెట్టడం కరెక్ట్ కాదు పెద్ది 
Loading..