రామ్ చరణ్ పెద్ది చిత్రం రిలీజ్ పై సస్పెన్స్ కొనసాగుతూనే ఉంది. ఏప్రిల్ 30 నుంచి పెద్ది తప్పుకోబోతుంది అని సోషల్ మీడియాలో స్ట్రాంగ్ గా ట్వీట్లు కనిపిస్తే రామ్ చరణ్ మాత్రం పెద్ది షూటింగ్ అయ్యిపోయింది, ఒక్క సాంగ్ మాత్రమే బ్యాలెన్స్, సినిమా అనుకున్న సమయానికే అంటూ పెద్ది రిలీజ్ పై హోప్స్ పెంచారు.
అయితే ఈ కన్ఫ్యూజన్ క్లియర్ కావాలి అంటే పెద్ది టీమ్ ప్రమోషన్స్ స్టార్ట్ చెయ్యాలి. ఏప్రిల్ 30 సినిమా రిలీజ్ అంటూ పాన్ ఇండియా ప్రమోషన్స్ స్టార్ట్ చేస్తే పెద్ది ఏప్రిల్ 30 కి వస్తుంది అనే కాన్ఫిడెన్స్ అటు అభిమానుల్లో, ఇటు మిగతా సినిమా లకు క్లారిటీ వస్తుంది. లేదు అంటే సినిమా వాయిదా విషయాన్ని ప్రకటించాలి.
పెద్ది ఏప్రిల్ 30 కి రావడం ఇంపాజిబుల్ అనుకుంటే గనక పెద్ది మేకర్స్ త్వరగా పెద్ది పోస్ట్ పోన్ విషయాన్ని ప్రకటిస్తే మే 1 కి పోటీపడుతున్న సినిమాలు ప్రమోషన్స్ చేసుకుంటాయి. అటు రిలీజ్ అని కాకుండా, ఇటు వాయిదా అని చెప్పకుండా ఎన్నాళ్ళు ఈ కన్ఫ్యూజన్ పెద్ది.. ఇది కరెక్ట్ కాదు అనేది నిపుణుల అభిప్రాయం.





బైకర్-రాకాస ఏ ఓటీటీల్లో చూడొచ్చంటే..

Loading..