Advertisementt

పాపను బాలీవుడ్ మాత్రమే ఆదుకోవాలి

Fri 03rd Apr 2026 05:53 PM
sreeleela  పాపను బాలీవుడ్ మాత్రమే ఆదుకోవాలి
Actress Sreeleela పాపను బాలీవుడ్ మాత్రమే ఆదుకోవాలి
Advertisement
Ads by CJ

అవును శ్రీలీల ను ఇక బాలీవుడ్ మాత్రమే ఆదుకోవాలి. తెలుగులో శ్రీలీల శకం ముగిసింది. బ్యాక్ టు బ్యాక్ టు సినిమాలు చేస్తూ సరైన కథలను ఎంచుకోకుండా బొక్క బోర్లా పడింది. రెండు సాంగ్స్ కి డాన్స్ లు, గ్లామర్ షో చెయ్యడం తప్ప శ్రీలీల కెరీర్ ను నిలబెట్టే సినిమా ఒక్కటి కూడా పడలేదు. 

ఉస్తాద్ భగత్ సింగ్ అయినా శ్రీలీల కెరీర్ కి టర్నింగ్ పాయింట్ అవుతుంది అనుకుంటే.. ఆమె పాత్రను ఉస్తాద్ భగత్ సింగ్ లో చూసిన వాళ్ళను బాగా డిజప్పాయింట్ చేసింది. ఇక శ్రీలీల ను ఇప్పుడు బాలీవుడ్ మాత్రమే ఆదుకోవాలి. కార్తీక్ ఆర్యన్ తో కలిసి స్క్రీన్ షేర్ చేసుకుంటున్న శ్రీలీల ఫస్ట్ బాలీవుడ్ చిత్రం త్వరలోనే విడుదలకు సిద్ధమవుతుంది.

తమిళనాట బ్యాక్ టు బ్యాక్ ఛాన్స్ లు ఉన్నప్పటికీ ఆ చిత్రాలు రీసెంట్ గానే మొదలయ్యాయి. సో ఏడాదిన్నరవరకు శ్రీలీల తమిళ మూవీ ప్రేక్షకుల ముందుకు రాదు. ఇక ఆమె ముందున్న ఏకైక ఆప్షన్ హిందీ ప్రాజెక్ట్ మాత్రమే. ఆ చిత్రం తో హిట్ కొట్టి శ్రీలీల బ్యాక్ బౌన్స్ అవ్వాల్సిందే. లేదంటే పాపం శ్రీలీల అనుకోవాల్సిందే. 

Actress Sreeleela:

Sreeleela-Bollywood

Tags:   SREELEELA
Advertisement




Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ