Advertisementt

షాకిస్తోన్న బాలయ్య లైనప్

Fri 03rd Apr 2026 11:28 AM
balakrishna  షాకిస్తోన్న బాలయ్య లైనప్
NBK With Young Director షాకిస్తోన్న బాలయ్య లైనప్
Advertisement
Ads by CJ

నందమూరి బాలకృష్ణ సైలెంట్ గా NBK 111 షూటింగ్ లో పాల్గొంటున్నారు. రీసెంట్ గా ఏపీ అసెంబ్లీ సమావేశాల్లో పాల్గొన్న బాలయ్య ఇప్పుడు హైదరాబాద్ తిరిగొచ్చాక షూటింగ్ కి హాజరవుతున్నారు. ఈ చిత్రాన్ని గోపిచంద్ మలినేని ఫుల్ యాక్షన్ కమర్షియల్ ఎంటర్టైనర్ గా తెరకెక్కిస్తున్నారు.

ఈ చిత్రంలో నయనతార హీరోయిన్ గా నటిస్తుండగా డింపుల్ హయతి పేరు సెకండ్ హీరోయిన్ గా వినిపిస్తుంది. అదలా ఉంటే బాలయ్య NBK 111 తర్వాత హారిష్ శంకర్ దర్శకత్వంలో సినిమా చేస్తారని అన్నప్పటికీ ఉస్తాద్ భగత్ సింగ్ రిజల్ట్ తర్వాత బాలయ్య మనసు మార్చుకున్నారనే టాక్ వినిపిస్తుంది.

మరోపక్క బాలయ్య లైనప్ పెరిగింది. ఆయన లైనప్ లో ఆదిత్య 999 ఉండనే ఉంది. ఇప్పుడు బాలయ్య తో దర్శకుడు విజయ్ కనకమేడల అదేనండి నాంది ఫేమ్ డైరెక్టర్ సినిమా ఒకటి లైన్ లోకి వచ్చింది. సుధాకర్ చెరుకూరి నిర్మాతగా ఈ చిత్రం సెట్స్ పైకి వెళ్లే ఛాన్స్ కనిపిస్తుంది. ఈ చిత్రంలో బాలయ్య పోలీస్ ఆఫీసర్ గా డ్యూయెల్ రో లో కనిపిస్తారని టాక్.

మరి బాలయ్య లైనప్ లోకి కొత్త కొత్త దర్శకులు క్రేజీగా ఎంటర్ అవుతున్నారు. అది చూసి నందమూరి ఫ్యాన్స్ సర్ ప్రైజ్ అవుతున్నారు.

NBK With Young Director :

Balakrishna to Work For Cop Drama With Vijay Kanakamedala

Tags:   BALAKRISHNA
Advertisement




Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ