40ఏళ్ల క్రితం సొంత జెట్‌లో షూటింగులకు!

నేటి ఆధునిక సినీ ప్రపంచంలో నయనతార వంటి టాప్ స్టార్స్ సొంతంగా ప్రైవేట్ జెట్ విమానాలు కలిగి ఉండి విలాసవంతమైన జీవనశైలిని గడపడం నిరంతరం చర్చల్లోకి వస్తూనే ఉంది. అయితే నేటి తరం తారల కంటే ఎంతో ముందే.. దాదాపు 40 సంవత్సరాల క్రితమే దక్షిణ భారత చిత్ర పరిశ్రమలో ఒక స్టార్ హీరోయిన్ సొంతంగా ప్రైవేట్ జెట్ విమానాన్ని, ఓడలను కలిగి ఉన్నారనే అరుదైన నిజం ఎందరికి తెలుసు?
అంతటి గొప్ప బ్యాక్ గ్రౌండ్ ఉన్న ఏకైక నటి మరెవరో కాదు.. లెజెండరీ యాక్ట్రెస్ కె. ఆర్. విజయ. తనకే కేవలం సొంత జెట్ మాత్రమే కాదు.. సొంతంగా ఓడలు ఉన్నాయని తన సోదరి ఓ ఇంటర్వ్యూలో తెలిపారు. కేఆర్ విజయ రాయల్ ఫ్యామిలీ నుంచి వచ్చారని వెల్లడించారు. సీనియర్ ఎన్టీఆర్, ఎంజీఆర్, శివాజీ గణేషన్ వంటి లెజెండ్స్ సరసన నటించారు. ఎన్బీకే భైరవద్వీపం, సింహా వంటి చిత్రాలలో తల్లి పాత్రలతోను మెప్పించారు.
తెలుగు తమిళం మలయాళం సహా అన్ని భాషలు కలుపుకుని 500 పైగా చిత్రాల్లో నటించారు. పదిహేను వయసులోనే నటనలో ప్రవేశించిన కేఆర్ విజయ ఎంతో ఒదిగి ఉండే లక్షణాలతో అరుదైన నటిగా గుర్తింపు తెచ్చుకున్నారు. వెండితెరపై ఆమె చిరునవ్వుకు ముగ్ధులైన అభిమానులు ఆమెను ప్రేమతో పున్నగై అరసి అని పిలుచుకునేవారు. దీని అర్థం చిరునవ్వుల రాణి అని. ఇక తన స్ఫురద్రూపం.. ప్రశాంతవదనం చూసి తనను శక్తి మాత పాత్రలకు ఎక్కువగా ఎంపిక చేసుకున్నారు దర్శకులు. టెలివిజన్ రంగంలోను కేఆర్ విజయ తనదైన ముద్ర వేసారు.






































