సూర్య కి బిగ్ రిలీఫ్

కొన్నాళ్లుగా సక్సెస్ కోసం వెయిట్ చేస్తున్న కోలీవుడ్ స్టార్ హీరో సూర్య కు కరుప్పు రిజల్ట్ బిగ్ రిలీఫ్ నిచ్చినట్టే కనిపిస్తుంది. ఫస్ట్ వీకెండ్ లోనే కరుప్పు వరల్డ్ వైడ్ గా రూ.135 కోట్లు కొలగొట్టడం అది కూడా సినిమా విడుదలైన తర్వాత ప్రేక్షకులు, క్రిటిక్స్ మిక్స్డ్ రెస్పాన్స్ చూపించిన తర్వాత.
నిజంగా కరుప్పు ఫస్ట్ డే ఫస్ట్ షో కి ఆడియన్స్ నుంచి రివ్యూ రైటర్స్ నుంచి మిక్స్డ్ రెస్పాన్స్ రావడంతో సూర్య కు మరో నిరాశ తప్పలేదు అనుకున్నారు. కానీ మిక్స్డ్ టాక్ తోనే కురుప్పు థియేటర్స్ లో కుమ్మి కుమ్మి వదిలిపెడుతుంది. విడుదలకు ముందు కురుప్పు నిర్మాతల ఆర్థికలావాదేవీల వలన సినిమా విడుదల ఆలస్యమైంది.
అయినప్పటికీ సూర్య కరుప్పు చిత్రాన్ని తమిళ ప్రేక్షకులు అక్కున చేర్చుకోవడంతో సూర్య బయటపడిపోయారు. జై భీం తర్వాత సూర్య కి సక్సెస్ దక్కలేదు. ఆయన నుంచి లాస్ట్ గా వచ్చిన రెట్రో డిజాస్టర్. ఇప్పుడు కరుప్పు సూర్య కి బిగ్ రిలీఫ్ నిచ్చింది అనే చెప్పాలి.






































