Advertisementt

ముత్తాత త‌ర్వాత రాముడి గెట‌ప్లో రణబీర్

Thu 02nd Apr 2026 11:40 AM
ramayana  ముత్తాత త‌ర్వాత రాముడి గెట‌ప్లో రణబీర్
Ranbir Kapoor as Lord Rama ముత్తాత త‌ర్వాత రాముడి గెట‌ప్లో రణబీర్
Advertisement
Ads by CJ

కపూర్ ఖాందాన్ వారసత్వం అరుదైన మైలురాయిని చేరుకుంది. సరిగ్గా 92 ఏళ్ల క్రితం 1934లో పృథ్వీరాజ్ కపూర్ `సీత` చిత్రంలో శ్రీరాముడి పాత్రలో నటించి మెప్పించగా ఇప్పుడు ఆయన మునిమనవడు రణబీర్ కపూర్ నితీష్ తివారీ దర్శకత్వంలో రూపొందుతున్న `రామాయణం`లో అదే పవిత్రమైన పాత్రను పోషిస్తున్నారు. ఒకే కుటుంబానికి చెందిన ఇద్దరు దిగ్గజ నటులు, రెండు వేర్వేరు శతాబ్దాలలో ఒకే పాత్రను వెండితెరపై ఆవిష్కరించడం సినీ చరిత్రలోనే  అరుదైన రికార్డు.

నాడు దేబకీ బోస్ దర్శకత్వంలో వచ్చిన `సీత` చిత్రం వెనిస్ ఫిల్మ్ ఫెస్టివల్‌లో ప్రదర్శించబడిన తొలి భారతీయ శబ్ద చిత్రంగా అంతర్జాతీయ కీర్తిని సంపాదించింది. అప్పట్లో పృథ్వీరాజ్ కపూర్ తన నటనతో రాముడి పాత్రకు ఒక ప్రత్యేక హుందాతనాన్ని తీసుకొచ్చారు. నేడు రణబీర్ కపూర్ తన ఆహార్యం, మాటతీరులో ఆ ఉదాత్తతను ప్రతిబింబించేలా ప్రత్యేక శిక్షణ తీసుకుని మరీ రంగంలోకి దిగారు. ముత్తాత వేసిన బాటలో నడవడం కేవలం ఒక అవకాశంగా కాకుండా ఒక గొప్ప బాధ్యతగా భావిస్తూ రణబీర్ ఈ భారీ బడ్జెట్ విజువల్ వండర్ కోసం ఎంతో శ్రమిస్తున్నారు.

అప్ప‌టి `సీత‌`లో  దుర్గా ఖోటే సీతగా నటించి రికార్డు సృష్టించగా ఇప్ప‌టి రామాయ‌ణంలో దక్షిణాది నటి సాయి పల్లవి సీతమ్మ పాత్ర పోషిస్తుంది. నాడు పృథ్వీరాజ్-దుర్గా ఖోటే సృష్టించిన మ్యాజిక్‌ను మళ్ళీ ర‌ణ‌బీక‌పూర్- సాయి ప‌ల్ల‌వి రిపీట్ చేస్తుందని మేకర్స్ ధీమా వ్య‌క్తం చేస్తున్నారు. రెండు భాగాలుగా రాబోతున్న ఈ పౌరాణిక గాథలో మొదటి భాగాన్ని ఇదే ఏడాది విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు. రెండ‌వ భాగాన్ని వ‌చ్చే ఏడాది రిలీజ్ చేయ‌నున్నారు.

 

Ranbir Kapoor as Lord Rama:

Ramayana-Rama Glinps Out

Tags:   RAMAYANA
Advertisement




Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ