Advertisementt

క్రేజీగా డెకాయిట్ థియేట్రికల్ బిజినెస్

Thu 02nd Apr 2026 10:34 AM
adivi sesh  క్రేజీగా డెకాయిట్ థియేట్రికల్ బిజినెస్
Dacoit Theatrical Business క్రేజీగా డెకాయిట్ థియేట్రికల్ బిజినెస్
Advertisement
Ads by CJ

ఇప్పటివరకు ఓ వర్గం ఆడియన్స్ కు మాత్రమే దగ్గరైన అడివి శేష్ ఇప్పుడు డెకాయిట్ తో అన్ని వర్గాల ఆడియన్స్ కి దగ్గరయ్యేలా ఆ చిత్ర కంటెంట్, ప్రమోషన్స్ కనిపిస్తున్నాయి. ప్రస్తుతం సోషల్ మీడియా మొత్తం అడివి శేష్ డాన్స్ గురించి మాట్లాడుకుంటున్నారు. అటు టీజర్, ఇటు అడివి శేష్ సర్ ప్రైజ్ డాన్స్ స్టెప్స్ అన్ని డెకాయిట్ పై హైప్ పెరిగేలా చేసింది. 

ఏప్రిల్ 10 న వరల్డ్ వైడ్ గా పాన్ ఇండియా మార్కెట్ లో విడుదల కాబోతున్న డెకాయిట్ చిత్ర ప్రీ రిలీజ్ బిజినెస్ సుమారు రూ.30 కోట్లు జరిగినట్లు గా టాక్ వినిపిస్తుంది. రెండు తెలుగు రాష్ట్రాలకు కలిపి రూ.20 కోట్ల మేర అమ్ముడయినట్లుగా తెలుస్తుంది. అందులో నైజాం రూ.7 కోట్లు, ఏపీ మొత్తంగా రూ.10 కోట్లకు డెకాయిట్ రైట్స్ అమ్ముడయ్యాయి.

తెలుగులోనే కాదు అటు ఓవర్సీస్ హక్కులు కూడా రూ.6.5 కోట్లకు పైగా అమ్ముడవడంతో అడివి శేష్ స్టామినా ఈ చిత్రంతో ప్రూవ్ అయ్యింది అంటున్నారు. మరి ఏప్రిల్ 10 న విడుదలవుతున్న అడివి శేష్ డెకాయిట్ ఎన్ని సంచనాలు సృష్టిస్తుందో చూడాలి.

Dacoit Theatrical Business:

Adivi Sesh Dacoit Sets Strong Pre Release Numbers

Tags:   ADIVI SESH
Advertisement




Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ