అల్లు అర్జున్-అట్లీ కలయికలో తెరకెక్కుతున్న #AA22 షూటింగ్ చిత్రీకరణ ముంబై లో ఎక్కువ భాగం జరుగుతుంది. ముంబై తర్వాత #AA22 షూటింగ్ దుబాయ్ వేదికగా జరగాల్సి ఉంది. దుబాయ్ లోని కొన్ని రేర్ లొకేషన్స్ లో భారీ యాక్షన్ సన్నివేశాల చిత్రీకరణను అట్లీ ప్లాన్ చేసి లొకేషన్స్ ఫైనల్ కూడా చేసారు.
కానీ ఇప్పుడు #AA22 షూటింగ్ కి ఇరాన్-ఇజ్రాయిల్ యుద్ధం వల్ల ఎఫెక్ట్ అవుతుంది. ఇరాన్ ఎక్కువగా దుబాయ్ పరిసరప్రాంతాలపై విరుచుకుపడుతుంది. ముంబై షెడ్యూల్, టీమ్ అల్లు అర్జున్ బర్త్ డే సెలెబ్రేషన్స్ తర్వాత దుబాయ్ లో ఓ భారీ షెడ్యూల్ ప్లాన్ చెయ్యగా అది యుద్ధం వల్ల ఆగినట్లుగా తెలుస్తుంది.
ఇక అల్లు అర్జున్ బర్త్ డే కి జస్ట్ టైటిల్ గ్లింప్స్ మాత్రం అట్లీ ప్లాన్ చేస్తున్నారట. ఎలాంటి వీడియో విజువల్స్ ఉండవని తెలుస్తుంది. మరి దుబాయ్ పై యుద్ధ నీడలు ఎప్పటికి సమసిపోతాయో లేదంటే దుబాయ్ ఎఫెక్ట్స్ తో ముంబై లో ఆ భారీ షెడ్యూల్ #AA22 కోసం ప్లాన్ చేస్తారో చూడాలి.





జన నాయగన్ పై చిగురిస్తున్న ఆశలు 
Loading..