Advertisementt

జన నాయగన్ పై చిగురిస్తున్న ఆశలు

Wed 01st Apr 2026 10:17 AM
jana nayagan  జన నాయగన్ పై చిగురిస్తున్న ఆశలు
Jana Nayagan Release Plans జన నాయగన్ పై చిగురిస్తున్న ఆశలు
Advertisement
Ads by CJ

కోలీవుడ్ స్టార్ హీరో విజయ్ నటించిన జన నాయకన్ చిత్ర రిలీజ్ పై సీరియల్ సస్పెన్స్ నడుస్తుంది. జనవరి 9 నుంచి పోస్ట్ పోన్ అయిన జన నాయకన్ చిత్రం ఇదిగో రిలీజ్ అదిగో రిలీజ్ అనడమే కానీ ఇప్పటికి ఆ సినిమా జాడ లేదు. జన నాయగన్ సెన్సార్ చిక్కులతో భారీ ఓటీటీ డీల్ నుంచి అమెజాన్ ప్రైమ్ తప్పుకోవడం, విడుదల వాయిదాలు అన్ని జన నాయకన్ నిర్మాతలను ఉక్కిరిబిక్కిరి అయ్యేలా చేసాయి. 

అయితే ఇప్పుడు జన నాయకన్ చిత్రం ఏప్రిల్ 24 న రిలీజ్ అయ్యే ఛాన్స్ కనిపిస్తుంది.. మరో వారం రోజుల్లో జన నాయకన్ రిలీజ్ డేట్ పై స్పష్టమైన ప్రకటన వస్తుంది అంటూ సోషల్ మీడియాలో జన నాయకన్ ను విజయ్ ఫ్యాన్స్ ట్రెండ్ చేస్తున్నారు. మరోపక్క ఏప్రిల్ 23 న తమినాడు అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి.

ఆ ఎన్నికల్లో విజయ్ పోటీ చేస్తున్నారు. ఈ ఎన్నికల్లో పార్టీ గెలుపు కోసం విజయ్ కష్టపడుతున్నారు. ప్రస్తుతం ఆ ఎన్నికల ప్రచారంలో విజయ్ బిజీగా వున్నారు. ఇక ఎన్నికల పోలింగ్ ముగిసిన తర్వాత రోజే నిజంగా జన నాయకన్ రిలీజ్ అయితే ఇక విజయ్ అభిమానులకు సంబరాలు చేసుకోవడానికి రెడీ అవ్వాల్సిందే.

Jana Nayagan Release Plans :

Jana Nayagan Likely To Release on April 24

Tags:   JANA NAYAGAN
Advertisement




Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ