దర్శకుడు బుచ్చి బాబు నిద్రాహారాలు మానేసి పెద్ది కోసం కష్టపడుతున్నాడు, పెద్ది ని ఆన్ టైమ్ కి తీసుకురావాలని బుచ్చి బాబు నిద్ర పోవడం లేదు, అది తెలిసి రామ్ చరణ్ బుచ్చి బాబు ని ముందు ఆరోగ్యం తరవాత పని అని సర్దిచెప్పారు అంటూ ప్రచారం జరగడం చూసి మెగా ఫ్యాన్స్ చాలా ఎగ్జైట్ అయ్యారు.
గత రెండు నెలలుగా బుచ్చి బాబు కష్టం గురించే మాట్లాడుతున్నారు. కానీ ఇప్పుడు పెద్ది బ్యాక్ టు బ్యాక్ రెండుసార్లు వాయిదా పడేసరికి సోషల్ మీడియాలో దర్శకుడు బుచ్చిబాబు ని తెగ ట్రోల్ చేస్తున్నారు. పెద్ది కోసం తెగ కష్టపడ్డావ్ బుచ్చి బాబు కానీ మాటపై నిలబడలేకపోయావ్ అంటూ వెటకారంగా కామెంట్స్ చేస్తున్నారు.
మార్చ్ 27 నుంచి పెద్ది ని వాయిదా వేస్తున్నప్పుడే అన్ని చూసుకుని కొత్త డేట్ ఇవ్వాల్సింది. కానీ హరిబరిగా రిలీజ్ డేట్ లాక్ చేసి దాని కోసం కష్టపడి అనుకున్న సమయానికి సినిమాని విడుదల చేయలేకపోవడం పెద్ది చిత్రానికి కాదు కాదు బుచ్చి బాబు కి మైనస్ గా మారింది. మరి ఏప్రిల్ 30 నుంచి పోస్ట్ పోన్ అయ్యి జూన్ 25 కి పెద్ది అంటున్నారు. ఇంకా అఫీషియల్ గా అనౌన్సమెంట్ అయితే రాలేదు.




ట్రైలర్ చూసి కొన్ని కొన్ని నమ్మేయ్యాలి డ్యూడ్... 
Loading..