మిర్చి సినిమాలో కటౌట్ చూసి కొన్ని కొన్ని నమ్మేయ్యాలి డూడ్ అనే డైలాగ్ వినిపిస్తే అభిమానులకు పూనకాలే. ఇప్పడు మరోసారి ప్రభాస్ నోట ఆ మాట వింటే.. ప్రభాస్ ఫ్యాన్స్ ఆగుతారా.. ప్రభాస్ శర్వానంద్ బైకర్ చిత్రాన్ని ప్రమోట్ చేస్తూ తన మిర్చి బైక్ పై ఎక్కుతూ.. ట్రైలర్ చూసి కొన్ని కొన్ని నమ్మేయ్యాలి డూడ్ అంటూ హెల్మెట్ తో ప్రభాస్ ని బైక్ పై చూడగానే ఫ్యాన్స్ అలెర్ట్ అవుతున్నారు.
శర్వానంద్ నటించిన లేటెస్ట్ చిత్రం బైకర్ చిత్రం ఏప్రిల్ 03 శుక్రవారం పాన్ ఇండియా మూవీ గా రిలీజ్ కాబోతుంది. నిర్మాతగా వంశి ప్రమోద్ ఉన్నారుగా.. అందుకే ప్రభాస్ రంగంలోకి దిగి బైకర్ ని ప్రమోట్ చేస్తున్నారన్నమాట.
శర్వా మా ఇంటి హీరో.. ప్రమోద్ వంశి నా ఫ్యామిలీ, నా ఫ్రెండ్ అంటూ బైక్ పై కవర్ తీసి దానిపై స్టయిల్ గా కూర్చుని శర్వా బైకర్ ని ప్రభాస్ ప్రమోట్ చేసిన తీరుకు కామన్ ఆడియన్స్ కూడా ఫిదా అవుతున్నారు.




అన్న నిలబెడితే.. తమ్ముడు మాత్రం 
Loading..