Advertisementt

పబ్లిక్ న్యూసెన్స్‌ అంటూ విజయ్ పై కేసు

Tue 31st Mar 2026 11:47 AM
vijay  పబ్లిక్ న్యూసెన్స్‌ అంటూ విజయ్ పై కేసు
Case filed against Vijay for public nuisance పబ్లిక్ న్యూసెన్స్‌ అంటూ విజయ్ పై కేసు
Advertisement
Ads by CJ

తమిళనాడు లో హీరో విజయ్ TVK పార్టీ పెట్టి ఈ ఏడాది అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేస్తున్నారు. అయితే బిజెపి విజయ్ పార్టీ తో పొత్తు కోసం వెంటపడింది. కానీ విజయ్ మాత్రం సోలో గానే ఈ ఎన్నికల్లో పోటీ చేస్తానని చెప్పారు. అయితే విజయ్ పై కక్ష తో బిజెపి విజయ్ సినిమాని విడుదల కాకూండా చేసింది అనే టాక్ ఉంది.

అలాగే విజయ్ పై కరూర్ తొక్కిసలాట కేసు నడుస్తున్న సమయంలోనే తాజాగా మరో 5 సెక్షన్ల కింద కేసులు నమోదు అవడం హాట్ టాపిక్ అయ్యింది. విజయ్‌తో పాటు 5 వేలమంది టీవీకే కార్యకర్తలపై కేసులు నమోదు అయ్యాయి. పెరవల్లూరు ర్యాలీ లో పబ్లిక్ ఇబ్బందిపడేలా వ్యవహరించారని.. విజయ్ ఇంకా ఆయన కార్యకర్తలు ఎన్నికల నిబంధనలు ఉల్లంఘించారని ఫ్లయింగ్ స్క్వాడ్ అధికారి ఫిర్యాదు మేరకు కేసులు నమోదు చేసారు. 

చెన్నైలోని పెరవల్లూరు పీఎస్‌లో టీవీకే పార్టీ చీఫ్ విజయ్‌పై, 5 వేలమంది టీవీకే కార్యకర్తలపై కేసులు నమోదు అయ్యాయి. పబ్లిక్ న్యూసెన్స్‌ తో పాటు 5 సెక్షన్ల కింద కేసులు నమోదు చేసారు.

Case filed against Vijay for public nuisance:

Case against TVK chief Vijay after Peravallur rally

Tags:   VIJAY
Advertisement




Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ