Advertisementt

ఓటీటీలోకి క్రేజీ తమిళ్ హిట్ మూవీ

Tue 31st Mar 2026 12:50 PM
thaai kizhavi  ఓటీటీలోకి క్రేజీ తమిళ్ హిట్ మూవీ
Latest Tamil Smash Hit OTT Details ఓటీటీలోకి క్రేజీ తమిళ్ హిట్ మూవీ
Advertisement
Ads by CJ

కోలీవుడ్ లో శివకుమార్ మురుగేశన్ దర్శకత్వంలో రాధికా శరత్ కుమార్ కీలక పాత్రలో నటించిన తాయ్ కెలవి థియేటర్స్ లో సంచనాలు సృష్టించింది. ఫిబ్రవరి 27 న థియేటర్స్ లో విడుదలైన తాయ్ కెలవి అదిరిపోయే కలెక్షన్స్ రాబట్టింది. లో బడ్జెట్ తో తెరకెక్కిన ఈ చిత్రం నాలుగు వారాల్లో రూ. 80.16 కోట్ల రూపాయల గ్రాస్ వసూలు చేసింది. 

థియేటర్స్ లో అనుకోని హిట్ గా నిలిచిన ఈ చిత్రం ఇప్పుడు ఓటీటీ డెబ్యూ కి రెడీ అయ్యింది. తాయ్ కెలవి స్ట్రీమింగ్ హక్కులను జియో హాట్ స్టార్ సొంతం చేసుకుంది. థియేటర్‌లలో విడుదలైన 6 వారాల తర్వాత ఓటీటీలో స్ట్రీమింగ్ చేయాలనే నిబంధన ప్రకారం డీల్ కుదిరింది. 

ఆ డీల్ ప్రకారమే రాధికా శరత్ కుమార్ తాయ్ కెలవిని ఏప్రిల్ 10 నుంచి తెలుగు, తమిళ, కన్నడ, మలయాళం, హిందీ భాషలలో స్ట్రీమింగ్ చేస్తున్నట్టుగా జియో హాట్ స్టార్ అఫీషియల్ గా ప్రకటించింది. 

Latest Tamil Smash Hit OTT Details:

 Thaai Kizhavi OTT Release Date

Tags:   THAAI KIZHAVI
Advertisement




Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ