Advertisementt

క్వాలిటీ కోసం - ఎన్నాళ్లీ కహానీలు

Mon 30th Mar 2026 01:58 PM
tollywood  క్వాలిటీ కోసం - ఎన్నాళ్లీ కహానీలు
Big Budget Movies క్వాలిటీ కోసం - ఎన్నాళ్లీ కహానీలు
Advertisement
Ads by CJ

మా షూటింగ్ పూర్తయ్యింది, కానీ క్వాలిటీ కోసం, ప్రేక్షకులకు బెస్ట్ ఎక్స్పీరియన్స్ కోసమే సినిమా ని పోస్ట్ పోన్ చేస్తున్నామంటూ చాలామంది చాలాసార్లు చివరి నిమిషంలో కథలు చెప్పడం చూస్తూనే ఉన్నాం. పెద్ద సినిమాలు రిలీజ్ డేట్ ని ప్రకటించడం దాని కోసం చివరి నిమిషం వరకు కష్టపడుతున్నారు. కానీ ఆ డేట్ రీచ్ కాలేక క్వాలిటీ కోసం సినిమా పోస్ట్ పోన్ అంటూ అభిమానుల మనోభావాలతో ఆడుకుంటున్నారు.

సినిమా కోసం ఓ ప్లానింగ్ ఉండాలి, నిర్మాతలు పెట్టె డబ్బుకు విలువ ఉండాలి. ఒకసారి సినిమా పోస్ట్ పోన్ అయితే ఒళ్ళు దగ్గరపెట్టుకుని మళ్లీ మంచి రిలీజ్ డేట్ ని అది కూడా తమ ప్రోగ్రెస్ బట్టి ప్లాన్ చేసుకోవాలి. ఆహా అలా కాకుండా దాని కోసం పోస్ట్ పోన్ చేసాం, దీని కోసం పోస్ట్ పోన్ అంటూ చెప్పి మళ్ళీ కొత్త డేట్ ని దగ్గరలోనే అనౌన్స్ చేసి చివరికి హరిబరిగా పరిగెత్తి మళ్ళా ఆ డేట్ ని చేజార్చుకోవడం అనేది ఎంతవరకు కరెక్ట్, ఇది అభిమానుల వాదన.

ఏళ్ళ తరబడి సెట్ పై ఉంటున్నాయి. షూటింగ్ చేస్తూనే ఉంటారు. కానీ ఎందుకో అనుకున్న టైమ్ కి విడుదల కావడానికి నానా ఇబ్బందుకు ఎదురవుతాయి. ఇప్పుడు రామ్ చరణ్ పెద్ది విషయంలో జరుగుతుంది అదే. ధురంధర్ 2 కోసం అంటూ మార్చి 27 నుంచి పోస్ట్ పోన్ చేసి గొప్పగా ఏప్రిల్ 30 రిలీజ్ అన్నారు.

కానీ ఇప్పుడు ఏప్రిల్ 30 నుంచి పెద్ది పోస్ట్ పోన్ పక్కా. కారణం క్వాలిటీ అవుట్ ఫుట్ కోసమే అనే కథ. అది పెద్ది యూనిట్ కి నిజమే అవ్వొచ్చు. అది రిలీజ్ డేట్ మార్చేటప్పుడు తెలీదా, అయిపోతుంది అనే నమ్మకమా. ఏది ఏమైనా భారీ బడ్జెట్ సినిమాలు, పాన్ ఇండియా మూవీస్ విషయంలో ఈ రిలీజ్ డేట్స్ మార్పు అనేది మైనస్ గా మారుతుంది. 

Big Budget Movies:

Tollywood

Tags:   TOLLYWOOD
Advertisement




Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ