పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ అవకాశం ఇచ్చినప్పుడు ప్రభాస్ ఫ్యాన్స్ మారుతి ని సోషల్ మీడియాలో ట్రోల్ చెయ్యడంతో ఆయన ప్రభాస్ తో చేస్తున్న రాజసాబ్ మూవీ అప్ డేట్స్ ని సోషల్ మీడియాలో తన స్నేహితుడు జర్నలిస్ట్ ని పట్టుకుని తన సినిమా అప్ డేట్స్ ని ట్వీట్లు వేయిస్తూ ప్రభాస్ ఫ్యాన్స్ ని కూల్ చేసుకుంటూ వచ్చాడు.
ప్రభాస్ రాజాసాబ్ అప్ డేట్ ని మారుతి ఏది డైరెక్ట్ గా ఇవ్వకుండా ఆ జర్నలిస్ట్ ఫ్రెండ్ తో ఇప్పించాడు. ఫ్యాన్స్ కూల్ అవ్వగానే నేరుగా సోషల్ మీడియాలో అప్ డేట్స్ ఇస్తూ వచ్చాడు. అయితే మారుతిని రాజసాబ్ ప్లాప్ అయినప్పుడు ఆ జర్నలిస్ట్ ఫ్రెండ్ ఎంతగా కాపాడుదామని ట్రై చేస్తూ ట్వీట్లు వేసినా ప్రభాస్ ఫ్యాన్స్ మారుతిని మాములుగా అటాక్ చెయ్యలేదు.
అందుకేనేమో ఈసారి మారుతి తన జర్నలిస్ట్ ఫ్రెండ్ ని నమ్ముకోకుండా డైరెక్ట్ గా తనే సోషల్ మీడియాలో తన కొత్త అప్ డేట్ అదేనండి.. హ్యాపీ పొంగల్ స్క్రిప్ట్ దాదాపుగా ఫైనల్ స్టేజ్ కి వచ్చింది అంటూ శ్రీరామనవమి రోజున సెల్ఫీ తో అప్ డేట్ ఇచ్చుకున్నాడు. సో ఈసారి ఏ ఫ్రెండ్ సాయం తీసుకోకుండా డైరెక్ట్ గానే రంగంలోకి దిగారు.
మారుతి తన నెక్స్ట్ ప్రాజెక్ట్ హ్యాపీ పొంగల్ 40-50 రోజుల్లో పూర్తి చెయ్యాలని ప్లాన్ చేసుకుని పక్కాగా రంగంలోకి దిగబోతున్నట్లుగా సోషల్ మీడియా టాక్.




ఎన్టీఆర్ ఫ్యాన్స్ తెగ ఫీలవుతున్నారు 

Loading..