మార్చ్ 19 న పాన్ ఇండియా థియేటర్స్ లో విడుదలైన ధురంధర్ 2 విధ్వంశం ఎలా ఉందొ తెలుసా.. ఆరు రోజులు తిరక్కముందే రూ.900 కోట్లు కొల్లగొట్టి రికార్డ్ క్రియేట్ చేసింది. మొదటి నాలుగు రోజులే కాదు వీక్ డేస్ లోను ధురంధర్ ద రివెంజ్ విధ్వంశం సృష్టిస్తుంది. తెలుగులో అయితే ఉస్తాద్ చిత్రాన్ని వదిలేసి ధురంధర్2 చూసేందుకు ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు.
దాంతో ముందు ఇచ్చిన స్క్రీన్స్ కన్నా ఇప్పుడు ధురంధర్ 2 కి స్క్రీన్స్ యాడ్ చేస్తున్నారు అంటే ఆ చిత్రం తెలుగు ఆడియన్స్ లో ఎంత ఇంపాక్ట్ క్రియేట్ చేసిందో అర్ధమవుతుంది. ఆదిత్య ధర్ దర్శకత్వం, రణ్వీర్ సింగ్ నటన, మాధవన్, సంజయ్ దత్, అర్జున్ రాంపాల్ ల నటన మాత్రమే కాదు BGM అన్ని ధురంధర్ 2 సక్సెస్ కి కారణమయ్యాయి.
నార్త్ లో ధురంధర్ 2 దూకుడు గురించి చెప్పక్కర్లేదు, కానీ మిగతా పాన్ ఇండియా భాషల్లో ధురంధర్ 2 చిత్రం సక్సెస్ చూసి ఆయా భాషల సెలబ్రిటీస్ పొగుడుతూ ట్వీట్లు వెయ్యడం మరో ఎత్తు. మరో రెండు రోజుల్లో అఫీషియల్ గా ధురంధర్ 2 రూ.1000 కోట్ల క్లబ్బులోకి వెళ్లడమే కాదు లాంగ్ రన్ లో ధురంధర్ 2 రూ.2000 కోట్ల క్లబ్బు ని సృష్టించడం ఖాయమంటూ ట్రేడ్ నిపుణులు అంచనా వేస్తున్నారు.





గుబులు రేపుతున్న వారణాసి బ్యూటీ

Loading..