సమ్మర్ వీకెండ్స్ కాదు బోరింగ్ వీకెండ్స్

వేసవి తాపం తో ప్రజలు అల్లాడిపోతున్నారు. రెండు తెలుగు రాష్ట్రాల్లో భానుడు ప్రతాపం మాటల్లో చెప్పనలవి కాదు. ఉదయం ఏడు గంటల నుంచే సూరీడు భగభగలు మధ్యన అల్లాడిపోతున్నారు. ఇలాంటి సమయంలో ఏ సినిమా థియేటర్ కో వెళ్లి సరదాగా ఏసి లో సినిమా చూద్దామంటే మంచి సినిమా థియేటర్ లో ఉండాలిగా..
ఏప్రిల్ మొదలు ఇప్పటివరకు ఏ వీకెండ్ లోను మంచి సినిమా వచ్చింది లేదు. కంటెంట్ బావుంటే చిన్న సినిమాలను ఆదరించే రోజుల్లో అసలు ఏ సినిమా కూడా ప్రేక్షకులను ఇంప్రెస్స్ చేయలేకపోతోంది. చిన్న, మీడియం సినిమాలు తప్ప ఈ సమ్మర్లో పెద్ద సినిమాలేవి రాలేదు. రాబోవడం లేదు.
గత వారం విడుదలైన సినిమాలన్ని షెడ్డుకెళ్ళిపోయాయి. ఈ వారం డబ్బింగ్ సినిమా సూర్య నటించిన వీరభద్రుడు తప్ప మరో సినిమా కనిపించడం లేదు. జూన్ 4 పెద్ది విడుదల వరకు థియేటర్స్ అన్ని వేసవి తాపంతో అల్లాడిపోతున్నాయి. మరి సమ్మర్ వీకెండ్స్ అన్ని బోరింగ్ వీకెండ్స్ గా మారిపోతున్నాయి.








































