విజయ్ కి అన్నాడీఎంకే లో ఓ వర్గం మద్దతు

ఇప్పటివరకు విజయ్ ఆశించిన పొత్తు ఇవ్వని అన్నాడీఎంకే పార్టీ లోని ఓ వర్గం విజయ్ టీవీకే పార్టీ కి మద్దతు ప్రకటించడం హాట్ టాపిక్ అయ్యింది. 108 సీట్ల తో అసంపూర్ణ మెజారిటీతో ప్రభుత్వాన్ని ఏర్పాటు చెయ్యలేక టీవీకే అధినేత విజయ్ అన్నాడీఎంకే ని మద్దతు కోరారు. కానీ అప్పుడు అన్నాడీఎంకేలో పళనిస్వామి వర్గం ఒప్పుకోలేదు.
అదే పళనిస్వామి వర్గం మాజీ సీఎం స్టాలిన్ డీఎంకే తో కలిసేందుకు ప్రయత్నం చెయ్యగా, పూర్తిగా అన్నాడీఎంకే ఎమ్యెల్యేలు డీఎంకే వైపు మొగ్గు చూపలేదు. ఈలోపే కాంగ్రెస్ మిగతా వామపక్షాల నేతలతో పొత్తు పెట్టుకుని విజయ్ సీఎం గా ప్రమాణ స్వీకారం చేసి ప్రభుత్వ ఏర్పాటుకు సన్నద్ధమయ్యారు. మరోపక్క అన్నాడీఎంకే లో చీలిక మొదలయ్యింది.
సీవీ షణ్ముగం, పళనిస్వామి వర్గం గా విడిపోయిన అన్నాడీఎంకే ఇప్పుడు కొంతమంది అంటే సీవీ షణ్ముగం వర్గం విజయ్ కి మద్దతు ప్రకటించింది. సీవీ షణ్ముగం వర్గంలో ఉన్న 30 మంది ఎమ్మెల్యేలు విజయ్ టీవీకే కు మద్దతు ప్రకటించడం గమనార్హం.
డీఎంకేతో అన్నాడీఎంకే కలవాలని ప్రయత్నించింది, అది నచ్చకే మేము పళనిస్వామి వర్గంతో విడిపోయాం, సీఎం విజయ్‌కు మద్దతు తెలపాలని నిర్ణయించుకున్నాం అంటూ అన్నాడీఎంకే ఎమ్మెల్యే సీవీ షణ్ముగం తెలిపారు.








































