Advertisementt

ఉస్తాద్ - ఇంకేం సక్సెస్ మీట్

Wed 25th Mar 2026 09:55 AM
ustaad bhagat singh  ఉస్తాద్ - ఇంకేం సక్సెస్ మీట్
Ustaad Bhagat Singh ఉస్తాద్ - ఇంకేం సక్సెస్ మీట్
Advertisement
Ads by CJ

ఉస్తాద్ భగత్ సింగ్ ని ప్రీ పోన్ చేసి మేకర్స్ బిగ్ మిస్టేక్ చేసారు. ఇది మేమంటున్న మాట కాదు ప్రస్తుతం ఇండస్ట్రీలో జరుగుతున్న చర్చ. ముందు అనుకున్నట్టుగా మార్చి 26 న ఉస్తాద్ భగత్ సింగ్ ని విడుదల చేసి ఉంటె ఉస్తాద్ కి బిగ్ ఓపెనింగ్స్ వచ్చేవి.. కానీ ధురంధర్2 దాటికి ఉస్తాద్ బిగ్ నంబర్స్ ని చేజార్చుకుంది.

సినిమా విడుదలయ్యాక మిక్స్డ్ టాక్ వచ్చినప్పటికీ.. ధురంధర్ 2 రెండు రోజులు తెలుగు వెర్షన్ అందుబాటులోకి రాకపోవడంతో ఉస్తాద్ కి కలిసొచ్చింది. అది కేవలం వీకెండ్ వరకే. వీక్ డేస్ మొదలు కాగానే ఉస్తాద్ భగత్ సింగ్ థియేటర్స్ వెలవెలబోతున్నాయి. కానీ దర్శకుడు హరీష్ శంకర్ మాత్రం తను మంచి సినిమా తీసాను, ఫ్యాన్స్ మెచ్చుకుంటున్నారు, పవన్ కళ్యాణ్ హగ్ ఇచ్చారు అంటూ చెబుతున్నారు.

అంతేకాకుండా దర్శకుడు హరీష్ శంకర్ ఇంకా ఇంకా ప్రమోట్ చేస్తున్నారు. ఆదివారం ఉస్తాద్ భగత్ సింగ్ సక్సెస్ మీట్ అన్నారు. ఆదివారంతో కలెక్షన్స్ పడిపోయిన ఉస్తాద్ భగత్ సింగ్ కి ఇంకేం సక్సెస్ మీట్ పెడతారు. పెట్టినా ప్రయోజనం ఏముంటుంది. ఇక పవన్ ఎలాగూ అందుబాటులోకి రారు. సక్సెస్ మీరట్ అన్నా నిర్మాతలు, హీరోయిన్స్ ని తీసుకొచ్చి హరీష్ శంకర్ స్టేజ్ ఎక్కాలి.

దాని వల్ల ప్రయోజనం ఏమి ఉండదు, అందుకే ఉస్తాద్ టీమ్ సక్సెస్ మీట్ పెట్టకుండా సైలెంట్ గా ఉన్నారనే టాక్ వినబడుతుంది. 

Ustaad Bhagat Singh:

Ustaad Bhagat Singh-Harish Shankar

Advertisement




Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ