కుర్ర హీరో శర్వానంద్ నారి నారి నడుమ మురారి తో ట్రాక్ లో పడ్డాడు. ఎలాంటి అంచనాలు లేకుండా సంక్రాంతికి సినిమాని రిలీజ్ చేసి హిట్ కొట్టిన శర్వానంద్ ఇప్పుడు ఏప్రిల్ 3 న బైకర్ తో ప్రేక్షకుల ముందుకు వస్తున్నాడు. అది కూడా పాన్ ఇండియా ప్రేక్షకుల ముందుకు రావడం అందరిని ఆశ్చర్యానికి గురి చేసింది.
డిసెంబర్ లో కేవలం తెలుగులోనే విడుదల అన్న బైకర్, ఇప్పుడు సైలెంట్ గా ఏప్రిల్ 3 న పాన్ ఇండియా ప్రేక్షకుల ముందు బైకర్ అంటూ అనౌన్స్ చెయ్యడం చూసి సైలెంట్ గా శర్వా భలే స్కెచ్ వేసాడంటూ మాట్లాడుకుంటున్నారు. నిన్న ఆదివారం తెలుగులో విడుదలైన ట్రైలర్ సినిమాపై అంచనాలు పెంచేసింది.
ఈరోజు చెన్నై లో బైకర్ రిలీజ్ చెయ్యబోతున్నారు. శర్వానంద్ అలాగే మరో సీనియర్ హీరో రాజశేఖర్, హీరోయిన్ మాళవిక నాయర్ లు బైకర్ ని పాన్ ఇండియా లో ప్రమోట్ చేస్తున్నారు. బైకర్ ట్రైలర్ చూసాక శర్వానంద్ మంచి డెసిషన్ తీసుకున్నాడు, ఈ చిత్రం ఖచ్చితంగా పాన్ ఇండియా మార్కెట్ లో వర్కౌట్ అవుతుంది అనే అభిప్రాయాలు పలువురు వ్యక్తం చేస్తున్నారు.





పవన్ కూడా హిట్ ఇవ్వలేకపోయారు 

Loading..