Advertisementt

పవన్ కూడా హిట్ ఇవ్వలేకపోయారు

Mon 23rd Mar 2026 07:33 PM
sreeleela  పవన్ కూడా హిట్ ఇవ్వలేకపోయారు
Sreeleela-Ustaad Bhagat Singh పవన్ కూడా హిట్ ఇవ్వలేకపోయారు
Advertisement
Ads by CJ

నిజమే పాపకు పవన్ కళ్యాణ్ కూడా హిట్ ఇవ్వలేకపోయారు. ఆ పాప ఎవరో ఈపాటికే గెస్ చేసి ఉంటారు. ఆమె శ్రీలీల. అందం, గ్లామర్ అన్ని ఉన్నా అమ్మడుకి అదృష్టమే లేదు. ధమాకా తర్వాత ఇప్పటికి వరకు హిట్టు అనేది శ్రీలీల కు రాలేదు. ఉస్తాద్ భగత్ సింగ్ తో పవన్ కళ్యాణ్ అయినా శ్రీలీల ను ఆదుకుంటారని ఆమె అభిమానులు నమ్మకంగా ఉన్నారు. 

మార్చ్ 19 ఉగాది స్పెషల్ గా విడుదలైన ఉస్తాద్ భగత్ సింగ్ చిత్రానికి మిక్స్డ్ రెస్పాన్స్ వచ్చినా పవన్ కళ్యాణ్ స్టామినా తో సినిమా కలెక్షన్స్ కి ఢోకా అయితే ఉండదు. కానీ ఉస్తాద్ భగత్ సింగ్ లో శ్రీలీల కేరెక్టర్ చూస్తే అయ్యో పాపం శ్రీలీల అంత ఉత్సహపడింది దీనికోసమేనా, పవన్ కళ్యాణ్ అనగానే గుడ్డిగా ఒప్పేసుకుంది. 

శ్రీలీల పాత్ర అందంగా ఉన్నా అది కేవలం సెకండాఫ్ కు మాత్రమే పరిమితమయ్యింది. జస్ట్ ఫ్లాష్ బ్యాక్ ఎపిసోడ్ లో కనిపించింది. అంతేతప్ప శ్రీలీల పెద్దగా కనిపించలేదు. అసలు ఉస్తాద్ లో పవన్ లుక్స్, ఆయన కేరెక్టర్ గురించి మాట్లాడుతున్నారు తప్ప హీరోయిన్స్ విషయం ఎవ్వరూ మాట్లాడకపోవడం గమనార్హం. 

పవన్ క్రేజ్ తో సినిమా బ్లాక్ బస్టర్ అవుతుంది అని ఆశపడిన శ్రీలీల కు ఉస్తాద్ భగత్ సింగ్ కూడా షాకివ్వడం చూసి ఆమెకన్నా ఎక్కువగా ఆమె అభిమానులు డిజప్పాయింట్ అవుతున్నారు. 

Sreeleela-Ustaad Bhagat Singh:

Sreeleela

Tags:   SREELEELA
Advertisement




Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ