Advertisementt

ఉస్తాద్ కి కలిసొచ్చిన ధురంధర్ 2

Fri 20th Mar 2026 12:05 PM
dhuranadhar  ఉస్తాద్ కి కలిసొచ్చిన ధురంధర్ 2
Ustaad Bhagat Singh vs Dhurandhar 2 ఉస్తాద్ కి కలిసొచ్చిన ధురంధర్ 2
Advertisement
Ads by CJ

అసలు ధురంధర్ 2 ముందు ఉస్తాద్ భగత్ సింగ్ ఎంత అన్నవారే ఇప్పుడు ఉస్తాద్ భగత్ కి కలిసొచ్చిన ధురంధర్ 2 అంటూ కామెంట్స్ చెయ్యడం హైలెట్ అవుతుంది. భారీ అంచనాల మధ్యన పాన్ ఇండియా భాషల్లో విడుదల కావల్సిన ధురంధర్ 2 చిత్రం కేవలం హిందీలోనే రిలీజ్ అయ్యి మిగతా భాషల్లో విడుదల కాకపోవడం ధురంధర్ పాన్ ఇండియా ఫ్యాన్స్ కి షాకిచ్చింది.

ఉస్తాద్ భగత్ సింగ్ కి ధురంధర్ తెలుగు వెర్షన్ వలన ఖచ్చితంగా ఎఫెక్ట్ అయ్యేదే. తృటిలో తపించుకుంది అనే సామెత గుర్తొచ్చేలా ఉస్తాద్ భగత్ సింగ్ ధురంధర్ 2 బారి నుంచి తప్పించుకుంది. తెలుగు వెర్షన్ రాకుండా హిందీ ఒక్కటే అందుబాటులోకి రావడం వల్ల .. చాలామంది ఫ్యామిలీ ఆడియన్స్, యూత్ డిజప్పాయింట్ అయ్యి అందరూ మిక్స్డ్ టాక్ వచ్చిన ఉస్తాద్ ని చూజ్ చేసుకుంటున్నారు.

ధురంధర్ 2 తెలుగు వెర్షన్ విడుదలైతే అందరూ దాని కోసమే వెళ్లేవారు. కానీ ఇప్పుడు అది లేకపోవడం ఉస్తాద్ కి బాగా కలిసొస్తుంది. లేదంటే యావరేజ్ టాక్ ఉస్తాద్ ని దెబ్బ తీసేది. 

 

Ustaad Bhagat Singh vs Dhurandhar 2:

Dhurandhar 2 Telugu version postponed

Tags:   DHURANADHAR
Advertisement



Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ