Advertisementt

ఉచిత బస్సులో త్రిమూర్తులు

Wed 18th Mar 2026 05:11 PM
ap  ఉచిత బస్సులో త్రిమూర్తులు
CM Chandrababu Launches Divyang Shakti ఉచిత బస్సులో త్రిమూర్తులు
Advertisement
Ads by CJ

ఆంధ్రప్రదేశ్ లోని కూటమి ప్రభుత్వంలో త్రిమూర్తులుగా ఫేమస్ అయిన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్, మంత్రి నారా లోకేష్.. ఈ ముగ్గురూ కలిసి ఎక్కడ కనిపించినా టీడీపీ కార్యకర్తలకు, జనసేన కార్యకర్తలకే కాదు అభిమానులకు కూడా పండగే. పెద్దన్నలా పవన్ కళ్యాణ్, తమ్ముడిలా నారా లోకేష్ వీరిద్దరి మధ్యన ఉన్న అనుబంధం ఎప్పటికప్పుడు ఏపీ రాజకీయాల్లో హైలెట్ అవుతూనే ఉంటుంది. ఇక చంద్రబాబు, పవన్ కళ్యాణ్ స్నేహం గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు.  

సూపర్ సిక్స్ పథకాలే కాదు ఏపీ ప్రజల కోసం ఏ పథకాన్ని ప్రవేశపెట్టినా చంద్రబాబు, పవన్ కళ్యాణ్, నారా లోకేష్ హాజరవ్వాల్సిందే. ముగ్గురి చేతుల మీదుగా ప్రతి కార్యక్రమం మొదలవుతుంది. ఈరోజు బుధవారం ఆర్టీసీ బస్సుల్లో దివ్యాంగులకు ఉచిత ప్రయాణ సౌకర్యం కల్పించే దివ్యాంగ శక్తి పథకం ప్రారంభమైంది. ముఖ్యమంత్రి చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, మంత్రి లోకేష్‌ ల చేతుల మీదుగా మంగళగిరి బస్టాండ్‌లో ఈ పథకాన్ని ప్రారంభించారు.

ఆతర్వాత చంద్రబాబు, పవన్ కళ్యాణ్, నారా లోకేష్ ముగ్గురు దివ్యంగులతో కలిసి ఉచిత బస్సులో ప్రయాణించారు. అది చూసే ఉచిత బస్సులో త్రిమూర్తులు అంటూ అభిమానులు కామెంట్స్ చేస్తున్నారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి కూటమి ప్రభుత్వంలో అమలవుతున్న సంక్షేమ పథకాల గురించి దివ్యాంగుల్ని అడిగి తెలుసుకున్నారు. 

ఈ దివ్యాంగ శక్తి పథకం ద్వారా దివ్యాంగులు ఐదు రకాల APSRTC బస్సుల్లో ప్రయాణించొచ్చు. వీటిలో సిటీ ఆర్డినరీ, మెట్రో ఎక్స్ ప్రెస్, పల్లెవెలుగు, అల్ట్రా పల్లెవెలుగు, ఎక్స్ ప్రెస్ బస్సులు ఉన్నాయి. మొత్తం 21 కేటగిరీల్లో 40 శాతం కంటే ఎక్కువ వైకల్యం ఉన్న దివ్యాంగులకు ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణం చేయొచ్చు.

CM Chandrababu Launches Divyang Shakti:

Andhra Pradesh Government Launches Divyang Shakti Schem

Tags:   AP
Advertisement



Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ