Advertisementt

ఉస్తాద్ కన్నా అది ఇంపార్టెంటా..

Wed 18th Mar 2026 04:34 PM
devi sri prasad  ఉస్తాద్ కన్నా అది ఇంపార్టెంటా..
Devi Sri Prasad-Ustaad Bhagat Singh ఉస్తాద్ కన్నా అది ఇంపార్టెంటా..
Advertisement
Ads by CJ

ఉస్తాద్ భగత్ సింగ్ కి మ్యూజిక్ ఇచ్చిన దేవిశ్రీ ప్రసాద్ ఇప్పుడు ప్రమోషన్స్ లో కనిపించడం లేదు. కారణం ఆయన ప్లేస్ లో థమన్ కనిపిస్తున్నాడు పవన్ కళ్యాణ్ వచ్చిన ఉస్తాద్ భగత్ సింగ్ ప్రీ రిలీజ్ ఈవెంట్ లో దేవిశ్రీ ప్రసాద్ మిస్ అవడం పై అనేక అనుమాలు లేవనెత్తినా.. హరీష్ శంకర్ ఇంకా నిర్మాతలు దేవిశ్రీ ప్రసాద్ చాలా బిజీ అన్నారు తప్ప క్లారిటి ఇవ్వలేదు.

ఇక నిన్న హరీష్ శంకర్ పలు ఇంటర్వ్యూలో దేవిశ్రీ ప్రసాద్ ఆదివారం ఉస్తాద్ భగత్ సింగ్ ఈవెంట్ జరుగుతున్న సమయంలో చెన్నై వెళ్ళాడు. అక్కడ జరిగిన కళాసుధ అవార్డు అందుకోవడాని వెళ్ళాడు అంటూ పదే పదే చెప్పినా ఈరోజు జరిగిన ఉస్తాద్ భగత్ సింగ్ ప్రీ రిలీజ్ ప్రెస్ మీట్ లో హరీష్ శంకర్ కి మళ్ళీ అదే ప్రశ్న ఎదురైంది.

దానికి హరీష్ శంకర్ మా మధ్యన ఏమి జరగలేదు. నాకు ఒక వ్యక్తితో పడకపోతే ... నేను ప్రశాంతంగా పడుకోగలనా, ఉస్తాద్ ఈవెంట్ కి దేవిశ్రీ వస్తున్నాడా అని కళ్యాణ్ గారు అడిగారు. దేవి శ్రీ ప్రసాద్ అవార్డు తీసుకోవడానికి వెళ్ళటం వల్లే రాలేదని కళ్యాణ్ గారికి తెలుసు.. అని చెప్పాడు.

ఇది విన్న పవన్ ఫ్యాన్స్ ఉస్తాద్ భగత్ సింగ్ కన్నా దేవిశ్రీ ప్రసాద్ కి కళా సుధా అవార్డు ఎక్కువా అంటూ మండిపడుతున్నారు.

Devi Sri Prasad-Ustaad Bhagat Singh:

Devi Sri Prasad

Tags:   DEVI SRI PRASAD
Advertisement



Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ