మరికొన్ని గంటల్లో హిట్ చిత్రం ధురంధర్ కి సీక్వెల్ గా తెరకెక్కి విడుదలకు సిద్దమైన ధురంధర్ ద రివెంజ్ చిత్రం ఈరోజు బుధవారం సాయంత్రం నుంచే ప్రీమియర్స్ తో సందడి చెయ్యడానికి రెడీ అయ్యింది. భారీ అంచనాలు, విపరీతమైన హైప్ నడుమ విడుదలకు ముందే రూ.100 కోట్ల ఓపెనింగ్స్ తో సంచలనం సృష్టించడానికి రెడీగా ఉన్న ధురంధర్ 2 కోసం ఫ్యాన్స్ ఎంతగా వెయిట్ చేస్తున్నారో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు.
కానీ ఇప్పుడు ధురంధర్ 2 కోసం వెయిట్ చేస్తున్న తెలుగు ఆడియన్స్ కి బ్యాడ్ న్యూస్. ధురంధర్ 2 తెలుగు ప్రీమియర్స్ ఈరోజు క్యాన్సిల్ అయినట్లుగా తెలుస్తుంది. ధురంధర్ 2 తెలుగు కంటెంట్ డిలే కావడంతో తెలుగు ప్రీమియర్స్ ని క్యాన్సిల్ చేస్తున్నట్టుగా తెలుస్తుంది.
కేవలం హిందీ వెర్షన్ మాత్రమే ఈరోజు సాయంత్రం ప్రీమియర్స్ ఉండబోతున్నాయి. మిగతా లాంగ్వేజెస్ ప్రీమియర్స్ ఆల్మోస్ట్ క్యాన్సిల్ అయినట్లే అంటున్నారు. ధురంధర్ ద రివెంజ్ చూసేందుకు ఎంతో ఆతృతగా ఉన్న తెలుగు ఆడియన్స్ ఈ విషం తెలిసి చాలా డిజప్పాయింట్ అవుతున్నారు.





UBS - వన్ మ్యాన్ ఆర్మీ పవన్ కాదు హరీష్ 

Loading..