మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ ప్రస్తుతం తన కొత్త చిత్రం `కొరియన్ కనకరాజు` కోసం దక్షిణ కొరియాలో భారీ షెడ్యూల్స్‌తో బిజీగా ఉన్నారు. అయితే ఈ సినిమా షూటింగ్ అనుభవాలు వరుణ్ తేజ్‌కు కొత్త సవాళ్లను విసురుతున్నాయి. వరుణ్ తేజ్ కంటే ముందే `మేడ్ ఇన్ కొరియా` చిత్రం కోసం అక్కడ 40 రోజుల పాటు చిత్రీకరణలో పాల్గొన్న ప్రియాంక మోహన్ అక్కడి పరిస్థితులు ఎంత కష్టతరంగా ఉంటాయో ఆసక్తికర విషయాలను పంచుకున్నారు. తమిళనాడు నుండి కొరియాకు వెళ్లే అమ్మాయి కథతో `మేడ్ ఇన్ కొరియా` రూపొందగా.. వరుణ్ తేజ్ సినిమా ఆంధ్రప్రదేశ్ నుండి కొరియాకు వెళ్లే అబ్బాయి కథతో ఫిక్షన్ హారర్ నేపథ్యంలో సాగుతుంది.
కొరియాలో వాతావరణం, ఆహారపు అలవాట్లు షూటింగ్ యూనిట్‌కు ప్రధాన సమస్యలుగా మారుతున్నాయి. ప్రియాంక మోహన్ తెలిపిన వివరాల ప్రకారం.. అక్కడ ఎప్పుడు ఎండ కాస్తుందో, ఎప్పుడు వర్షం పడుతుందో లేక మంచు కురుస్తుందో అంచనా వేయడం అసాధ్యం. అప్పటికప్పుడు మారిపోయే వాతావరణం వల్ల షూటింగ్ షెడ్యూల్స్ నిర్వహించడం నటీనటులకు, సాంకేతిక నిపుణులకు పెద్ద పరీక్షగా మారుతుంది.
ఇక ఆహారం విషయానికొస్తే, అక్కడ రెడ్ మీట్ వినియోగం ఎక్కువగా ఉండటంతో శాకాహారులకు కష్టాలు తప్పవు. అందుకే ప్రియాంక కూడా అక్కడ తప్పనిసరి పరిస్థితుల్లో చికెన్ అలవాటు చేసుకోవాల్సి వచ్చింది. ప్రస్తుతం వరుణ్ తేజ్ కూడా ఇవే క్లిష్ట పరిస్థితుల్లో తన సినిమా చిత్రీకరణను పూర్తి చేస్తున్నారు. అయితే వరుణ్ నాన్ వెజిటేరియన్ కాబట్టి ఫుడ్ తో ప్రియాంకకు ఉన్న సమస్యలేవీ లేవ్!





ఈ వారం థియేటర్ అండ్ ఓటీటీ రిలీజులు 

Loading..