Advertisementt

ఉస్తాద్ భగత్ సింగ్ లో అవే హైలైట్స్

Tue 17th Mar 2026 08:16 PM
pawan  ఉస్తాద్ భగత్ సింగ్ లో అవే హైలైట్స్
These are the highlights of Ustaad Bhagat Singh ఉస్తాద్ భగత్ సింగ్ లో అవే హైలైట్స్
Advertisement
Ads by CJ

మరొక్క రోజులో అంటే కొన్ని గంటల్లో థియేటర్స్ లో విడుదలకు సిద్దమైన ఉస్తాద్ భగత్ సింగ్ చిత్రం కోసం ఆయన అభిమానులే కాదు రెండు తెలుగు రాష్ట్రాల ప్రేక్షకులు వెయిటింగ్. అటు ఓవర్సీస్ ఆడియన్స్ ఎంతగా వెయిట్ చేసున్నారో అక్కడ తెగుతున్న టికెట్స్ చూస్తే తెలుస్తుంది. ఇక సోషల్ మీడియాలోనూ ఉస్తాద్ పై నిన్నటివరకు ఉన్న అభిప్రాయాలు మారుతున్నాయి. 

ఉస్తాద్ భగత్ సింగ్ పై క్రేజ్ ఎక్కడో తగ్గుతుంది అన్నప్పటికీ.. ఇప్పుడు ఉస్తాద్ సత్తా కనిపిస్తుంది అంటూ మాట్లాడుతున్నారు. ఇక సోషల్ మీడియాలో ఉస్తాద్ భగత్ సింగ్ హైలైట్స్ పై, అలాగే సెన్సార్ టాక్ పై కనిపిస్తున్న ట్వీట్లు పవన్ అభిమానులను రిలాక్స్ మోడ్ లోకి పంపిస్తున్నాయి. ఇప్పటివరకు ఉస్తాద్ ఇంటర్వెల్ బ్యాంగ్ హైలైట్ అన్నారు.

ఇప్పుడు ఉస్తాద్ చిత్రాన్ని వీక్షించిన వారు సినిమా లాస్ట్ మినిట్స్ ప్యూర్ హై అంటున్నారు... అంతేకాదు ఉస్తాద్ లోని రెండు సాంగ్స్ కి థియేటర్స్ ఊగడం గ్యారంటీ అంట, హీరో ఎమోషన్స్, ఎలివేషన్స్ కలిపి ఫ్యాన్స్ కి ఫుల్ మీల్స్ పెట్టాడు డైరెక్టర్ హరీష్ శంకర్, హిట్ బొమ్మతో ఉగాది పండగ సెలెబ్రేట్ చేసుకోవచ్చు అంటూ ఉస్తాద్ భగత్ సింగ్ పై వేస్తోన్న ట్వీట్లు ఇప్పుడు సోషల్ మీడియాలో హైలెట్ అవుతున్నాయి. 

These are the highlights of Ustaad Bhagat Singh:

Ustaad Bhagat Singh

Tags:   PAWAN
Advertisement



Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ