Advertisementt

పెద్ద దిక్కు లేని టాలీవుడ్

Thu 12th Mar 2026 09:33 AM
thammareddy  పెద్ద దిక్కు లేని టాలీవుడ్
Tollywood పెద్ద దిక్కు లేని టాలీవుడ్
Advertisement
Ads by CJ

తాజాగా ఓ సినిమా ప్ర‌మోష‌న్స్ లో వెట‌ర‌న్ ద‌ర్శ‌క‌నిర్మాత త‌మ్మా రెడ్డి భ‌ర‌ద్వాజా మాట్లాడుతూ.. టాలీవుడ్ కి పెద్ద దిక్కు ఎవ‌రూ లేర‌ని అన్నారు. ఎవ‌రైనా చేసే ప‌నుల కార‌ణంగా పెద్ద దిక్కు అవుతారు. అలా ఒక పెద్దాయ‌న అయ్యారు. ఆయ‌న (దాస‌రి) వ‌ద్ద‌కు మేం వెళ్లేవాళ్లం. ఆయ‌నే చివ‌రివాడు. ఆ త‌ర్వాత ఎవ‌రూ పెద్ద దిక్కు కాలేరు... అని త‌మ్మారెడ్డి భ‌ర‌ద్వాజా అన్నారు..

పెద్ద దిక్కు అనే ప‌ద‌వి ఏమైనా ఉందా? అలాంటి ప‌ద‌వి ఏదీ లేద‌ని కూడా వ్యంగ్యంగా వ్యాఖ్యానించారు.. దీనిని బ‌ట్టి మెగాస్టార్ చిరంజీవి పెద్ద దిక్కు అని భావించేవారిలో సందిగ్ధం మొద‌లైంది. 

టాలీవుడ్ ఆర్టిస్టుల‌లో, టెక్నీషియ‌న్ల‌లో ఆర్థికంగా చితికిపోయి పేద‌రికంలో ఉన్న‌వారికి విరివిగా విరాళాలు ఇచ్చిన పెద్ద మ‌నిషి.. క‌రోనా క్రైసిస్ క‌ష్ట‌కాలంలో ప‌రిశ్ర‌మ‌లో ఉన్న కార్మికులు, జ‌ర్న‌లిస్టులు అంద‌రికీ నిత్యావ‌స‌రాలు అందించిన పెద్ద మ‌నిషి.. రెండు రాష్ట్రాల‌లో అన్ని జిల్లా హెడ్ క్వార్ట‌ర్స్ లో అభిమానుల‌తో ఆక్సిజ‌న్ సిలిండ‌ర్లు స‌ర‌ఫరా చేసి క‌రోనా క‌ల్లోలంలో కాపాడే ప్ర‌య‌త్నం చేసిన పెద్ద మ‌నిషి ఎవ‌రూ లేరంటారా?  త‌మ్మా రెడ్డికి ఇవేవీ గుర్తుకు రాలేదా ఈ ప్ర‌క‌ట‌న చేసేముందు అంటూ కొంద‌రు ప్ర‌శ్నిస్తున్నారు. దీనికి త‌మ్మా రెడ్డి స‌మాధానం ఏమిటో వేచి చూడాలి.

Tollywood:

Thammareddy Bharadwaja-Tollywood

Tags:   THAMMAREDDY
Advertisement




Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ