Advertisementt

కుంభ‌మేళా మోనాలిసా వివాదాస్ప‌ద‌ పెళ్లి

Thu 12th Mar 2026 08:54 AM
monalisa  కుంభ‌మేళా మోనాలిసా వివాదాస్ప‌ద‌ పెళ్లి
Monalisa Bhosle marries boyfriend Farman Khan కుంభ‌మేళా మోనాలిసా వివాదాస్ప‌ద‌ పెళ్లి
Advertisement
Ads by CJ

ప్రయాగ్‌రాజ్ మహాకుంభమేళాలో సెన్సేషన్‌గా మారిన మోనాలిసా భోంస్లే తన వివాహంతో అందరినీ ఆశ్చర్యపరిచారు. తన తండ్రి అభీష్టానికి వ్యతిరేకంగా, ఫేస్‌బుక్‌లో పరిచయమైన ఫర్మాన్ ఖాన్‌ను ఆమె మతాంతర వివాహం చేసుకోవడం ఇప్పుడు పెద్ద చర్చకు దారితీసింది. కుటుంబ సభ్యుల నుంచి తీవ్ర వ్యతిరేకత ఎదురైనా.. తన ప్రేమను గెలిపించుకోవాలనే పట్టుదలతో తాను అనుకున్న‌ది సాధించుకున్నారు.

ఈ వివాహం తీవ్ర ఉత్కంఠ మధ్య కేరళలో జరిగింది. తన తండ్రి తనను బలవంతంగా ఇంటికి తీసుకెళ్లేందుకు ప్రయత్నిస్తున్నారని, తనకు ప్రాణహాని ఉందని భావించిన మోనాలిసా పోలీసులను ఆశ్రయించి రక్షణ కోరారు. కేరళ విద్యాశాఖ మంత్రి వి. శివన్‌కుట్టి వంటి ప్రముఖుల సమక్షంలో, స్థానిక పోలీసుల రక్షణతో వీరిద్దరూ ఒక్కటయ్యారు. 

ఆత్మగౌరవం, వ్యక్తిగత స్వేచ్ఛ కోసం తన తండ్రిని ఎదిరించి మోనాలిసా తీసుకున్న ఈ నిర్ణయం ప్రస్తుతం ఇంటర్నెట్‌లో హాట్ టాపిగ్గా మారింది. మోనాలిసా ఇంత‌కుముందు ఓ రెండు చిత్రాల్లో న‌టించింది. ప్ర‌స్తుతం న‌టిగా కెరీర్ ని కొన‌సాగిస్తోంది.

Monalisa Bhosle marries boyfriend Farman Khan:

Monalisa Bhosle 

Tags:   MONALISA
Advertisement




Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ