Advertisementt

ఓవర్సీస్ లో దుమ్మురేపుతున్న ఉస్తాద్

Mon 09th Mar 2026 11:00 AM
ustaad bhagat singh  ఓవర్సీస్ లో దుమ్మురేపుతున్న ఉస్తాద్
Ustaad is making waves overseas ఓవర్సీస్ లో దుమ్మురేపుతున్న ఉస్తాద్
Advertisement
Ads by CJ

OG తర్వాత హీరో పవన్ కళ్యాణ్ నుంచి రాబోతున్న చిత్రం ఉస్తాద్ భగత్ సింగ్. హరీష్ శంకర్ దర్శకత్వంలో తెరకెక్కిన ఉస్తాద్ భగత్ సింగ్ మార్చ్ 19 న విడుదల కాబోతుంది. ఈ చిత్రం పై ట్రేడ్ లో విపరీతమైన అంచనాలున్నాయి. రీసెంట్ గా విడుదలైన ట్రైలర్ టీజ్ సినిమాపై ఉన్న అంచనాలను డబుల్ చేసింది.

పవన్ కళ్యాణ్ లుక్స్, ఆయన చెప్పే పవర్ ఫుల్ డైలాగ్స్ ని ఫ్యాన్స్ చాలా ఎంజాయ్ చేస్తున్నారు. ప్రస్తుతం ఉన్న హైప్ తో ఉస్తాద్ భగత్ సింగ్ ఓవర్సీస్ లో ఊచకోత మొదలు పెట్టింది. నార్త్ అమెరికాలో ఉస్తాద్ భగత్ సింగ్ హవా మాములుగా లేదు. ప్రీమియర్ షోల బుకింగ్స్ ఓపెన్ అయిన కొన్ని గంటల్లోనే 50 వేల డాలర్లకు పైగా గ్రాస్ వసూలు చేసి అందరికి షాకిచ్చింది.

ఉస్తాద్ భగత్ సింగ్ పై ఉన్న ఈ జోరు చూస్తుంటే ప్రీమియర్లతోనే భారీ వసూళ్లు రాబట్టే అవకాశం కనిపిస్తోంది. ఈ చిత్రంలో పవన్ కళ్యాణ్ శ్రీలీల, రాశి ఖన్నా లతో రొమాన్స్ చేస్తున్నాడు. అన్నట్టు ఉస్తాద్ భగత్ సింగ్ తమిళ తేరి కి రీమేక్ కాదు అని హరీష్ శంకర్ స్పష్టం చెయ్యడము సినిమాపై క్రేజ్ మరింత పెరిగేలా చేసింది. 

Ustaad is making waves overseas:

Ustaad Bhagat Singh

Advertisement



Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ