Advertisementt

అభిమాని డైరీ కన్నీళ్లు పెట్టుకున్న తనూజ

Mon 09th Mar 2026 10:14 AM
thanuja  అభిమాని డైరీ కన్నీళ్లు పెట్టుకున్న తనూజ
Thanuja Gets Emotional అభిమాని డైరీ కన్నీళ్లు పెట్టుకున్న తనూజ
Advertisement
Ads by CJ

స్టార్ మా సీరియల్ లో నటిగా ప్రేక్షకుల హృదయాలకు దగ్గరైన కన్నడ నటి తనూజ పుట్టస్వామి బిగ్ బాస్ హౌస్ తో తెలుగు ప్రేక్షకులకు మరింతగా దగ్గరైంది. చాలామంది అభిమానులు తనూజ ను తమ ఇంటి బిడ్డగానే భావించారు. ఉంటే ఇలాంటి కూతురు ఉండాలి, ఉంటె ఇలాంటి సోదరి ఉండాలి, ఉంటె ఇలాంటి భార్య ఉండాలి అనుకునేంతగా తనూజ తెలుగు ఆడియన్స్ గుండెల్లో గుడి కట్టించుకుంది.

బిగ్ బాస్ రన్నర్ గా నిలిచి పబ్లిక్ లో ఆచి తూచి కనిపించే తనూజ రీసెంట్ గా తిరుమల తిరుపతి లో దివ్వెల మాధురి తో కలిసి ఆమె బర్త్ డే కి కేక్ కట్ చేయడం వివాదాస్పదమైంది. అదలా ఉంటే తాజాగా తనూజ తన ఇన్స్టా స్టోరీస్ లో ఓ అభిమాని తన కోసం రాసిన డైరీ చదువుతూ కన్నీళ్ళు పెట్టుకుంది. తాను అభిమానించే ఓ మహిళ తన కోసం ఎంతో అభిమానంగా డైరీ రాసింది.. అంటూ చెప్పుకొచ్చింది. 

నేను ఎంత అదృష్టవంతురాలినో.. నాకు పుస్తకాలు చదవడమంటే చాలా ఇష్టం. ఇప్పుడు నేను చదువుతున్నది ఎంతో ప్రత్యేకమైన పుస్తకం. నా యోగక్షేమాలు కోరుకునే వ్యక్తి నాకోసం రాసిన డైరీ ఇది. దాన్ని చదువుతుంటే నాకు మాటలు రావడం లేదు, ఇది చదువుతూ ఉంటె నాకు కన్నీళ్లు వస్తున్నాయి.

మనల్ని పూర్తిగా అర్ధం చేసుకునేది మన కుటుంబం, కానీ నా విషయంలో అది మాత్రమే కాదు చాలామంది నన్ను అర్థం చేసుకున్నారు, అక్కున చేర్చుకున్నారు, నిజంగా నా జీవితానికి ఇది చాలు.. అంటూ తనూజ ఎమోషనల్ అవుతూ పెట్టిన పోస్ట్ వైరల్ గా మారింది. 

Thanuja Gets Emotional :

Bigg Boss Thanuja Puttaswamy Gets Emotional Over Lady Fan Heartfelt Dairy

Tags:   THANUJA
Advertisement



Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ