Advertisementt

జవాన్ తర్వాత నయన్ మరో బాలీవుడ్ ఫిలిం

Sun 08th Mar 2026 03:23 PM
nayanthara  జవాన్ తర్వాత నయన్ మరో బాలీవుడ్ ఫిలిం
Nayanthara Gearing Up For Another Bollywood Project జవాన్ తర్వాత నయన్ మరో బాలీవుడ్ ఫిలిం
Advertisement
Ads by CJ

సౌత్ లో లేడీ సూపర్ స్టార్ గా పేరు తెచ్చుకున్న నయనతార కోలీవుడ్, టాలీవుడ్ లో క్రేజీ స్టార్ హీరోలతో నటించడమే కాదు కథ డిమాండ్ చేస్తే యంగ్ హీరోలతో నటించడానికి కూడా నయనతార వెనుకాడదు. అంతేకాదు లేడీ ఓరియెంటెడ్ ఫిలిమ్స్ తోనూ నయనతార పాపులర్ అయ్యింది. 

సౌత్ లో విపరీతమైన కేజ్ ఉన్న నయనతార అందరిలా బాలీవుడ్ ఆఫర్స్ కోసం వెంపర్లాడలేదు. ఎన్ని హిందీ అవకాశాలు తలుపు తట్టినా ఒప్పుకోలేదు. షారుఖ్ తో కోలీవుడ్ డైరెక్టర్ అట్లీ తో జవాన్ మూవీ తో హిందీలోకి అడుగుపెట్టి బ్లాక్ బస్టర్ హిట్ కొట్టినా.. ఆతర్వాత వచ్చిన హిందీ క్రేజీ అవకాశాలను నయనతార వదులుకుంది అనే టాక్ ఉంది. 

తాజాగా నయనతార జవాన్ తర్వాత మరో బాలీవుడ్ ఫిలిం కి ఓకే చెప్పినట్లుగా తెలుస్తుంది. ముంబైకి చెందిన మినీ ఫిల్మ్స్ అనే సంస్థ నిర్మించబోయే ఓ సినిమాలో ఆమె నటించనున్నారనే వార్త మీడియాలో చక్కర్లు కొడుతున్నది. భారీ రెమ్యునరేషన్ తో పాటుగా కథలో తన పాత్ర పవర్ ఫుల్ గా ఉండడంతో నయనతార ఆ హిందీ ఫిలిం కి సైన్ చేసినట్లుగా తెలుస్తుంది.

Nayanthara Gearing Up For Another Bollywood Project:

Nayanthara Gearing Up For Another Bollywood Project After Jawan

Tags:   NAYANTHARA
Advertisement



Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ