Advertisementt

CM ఎన్టీఆర్ అనే సౌండ్ బావుంది కానీ!

Sun 08th Mar 2026 02:26 PM
ntr  CM ఎన్టీఆర్ అనే సౌండ్ బావుంది కానీ!
NTR Fans Go Berserk in Bangalore CM ఎన్టీఆర్ అనే సౌండ్ బావుంది కానీ!
Advertisement
Ads by CJ

బెంగళూరులోని కిమ్స్ ఆసుపత్రి ప్రాంగణం యంగ్ టైగర్ ఎన్టీఆర్ అభిమానుల నినాదాలతో దద్దరిల్లిపోయింది. అక్కడకు చేరుకున్న తారక్‌కు అభిమానులు కేవలం స్వాగతం పలకడమే కాకుండా, `CM NTR` అని రాసి ఉన్న ప్లకార్డులతో అపూర్వ రీతిలో నీరాజనాలు పలికారు. ఈ అద్భుత దృశ్యాన్ని చూస్తుంటే ఎన్టీఆర్ కెరీర్ మలుపు తిప్పిన `సింహాద్రి` సినిమాలోని భారీ జనసందోహం సీన్లను తలపించింది. కర్ణాటక వ్యాప్తంగా ఎన్టీఆర్‌కు ఉన్న క్రేజ్ మరోసారి ఈ ఘటనతో నిరూపితమైంది.

ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ఎన్టీఆర్ కీలక పాత్ర పోషించాలని.. అత‌డిని సీఎంగా చూడాలనే కోరిక అభిమానుల గుండెల్లో కొన్నేళ్ల క్రిత‌మే బలంగా నాటుకుపోయింది. గత కొంతకాలంగా ఈ తరహా నినాదాలు తగ్గుముఖం పట్టినా ఏదో ఒక రోజు ఫ్యాన్స్ గుండెల్లోంచి ప్ర‌ళ‌యం బ‌య‌ట‌కు రావ‌డం ఖాయంగానే భావిస్తున్నారు.

బెంగళూరు వీధుల్లో మళ్ళీ `సీఎం ఎన్టీఆర్` అనే సౌండ్ ప్ర‌తిధ్వ‌నించ‌డం చాలా ప్ర‌శ్న‌ల‌ను లేవ‌నెత్తింది. అయితే తార‌క్ ప్ర‌స్తుతం అందుకు సిద్ధంగా లేడు. రాజ‌కీయాలు అత‌డి తొలి ప్రాధాన్య‌త కాదు. జూనియర్ ఎన్టీఆర్ ప్రస్తుతం తన పూర్తి దృష్టిని సినిమా కెరీర్ పైనే పెట్టారు. కానీ అత‌డి రాజకీయ ప్రవేశం కోసం ఫ్యాన్స్ మాత్రం ఎంతో ఉత్సుకతతో వేచి చూస్తున్నారు. 

తాజా నినాదాలు భవిష్యత్తులో ఎన్టీఆర్ రాజకీయ ప్రయాణంపై అభిమానులు పెట్టుకున్న అంచనాలకు అద్దం పడుతున్నాయి. త‌మిళ‌నాడులో ద‌ళ‌ప‌తి విజ‌య్ రాజ‌కీయాల్లో ప్ర‌వేశించిన నేప‌థ్యంలో మ‌రోసారి జూనియ‌ర్ ఎన్టీఆర్ రాజ‌కీయాల గురించి చ‌ర్చ జ‌రిగే అవ‌కాశం లేక‌పోలేదు.

 

 

 

 

 

 

 

 

 

NTRNeel షూటింగ్-షాకవుతున్న ఫ్యాన్స్ 

యంగ్ టైగర్ ఎన్టీఆర్ ఈరోజు బెంగళూరు లోని ఓ ఆసుపత్రి ఓపెనింగ్ లో పాల్గొన్నారు. ఎన్టీఆర్ వస్తున్నారని తెలియగానే ఆయన అభిమానులు బారులు తీరారు. అంటే కాదు ఎన్టీఆర్ ని సీఎం అంటూ కటౌట్స్ పెట్టి ఘన స్వాగతం పలికారు. ఎన్టీఆర్ కూడా కార్ పైకి ఎక్కి అభిమానులకు అభివాదం చెయ్యడం.. ఇలా ఈరోజు సోషల్ మీడియా మొత్తం ఎన్టీఆర్ మాత్రమే ట్రెండ్ అవుతున్నారు.

ఇక #NTRNeel కలయికలో తెరకెక్కుతున్న NTR 31 డ్రాగన్(వర్కింగ్ టైటిల్) చిత్ర షూటింగ్ విషయాలు ఏమైనా బయటికి వస్తే ఎగ్జైట్ అవ్వాల్సిన అభిమానులు ఇప్పుడు షాకవుతున్నారు. కారణం షూటింగ్ ఇంకా ఇంకా నడుస్తుంది.. అసలు ఫస్ట్ లుక్ ఎప్పుడు వదులుతారు, ఎప్పుడు సినిమా  చేస్తారనే ఆందోళన వారిలో కనిపిస్తుంది.

ఇక తాజాగా #NTRNeel మూవీ షూటింగ్ కోసం హైదరాబాద్ రామోజీ ఫిలిం సిటీలో మూడు భారీ సెట్ లు నిర్మాణం చేపట్టారట. అందులో ఒకటి విలన్ సెట్, ఒకటి ఇంటి సెట్.. ఆ భారీ సెట్స్ లోనే #NTRNeel మూవీ షూటింగ్ నలభై రోజులు పాటు లాంగ్ షెడ్యూల్ ఉండబోతుంది అని తెలుస్తుంది.

అది చూసిన ఎన్టీఆర్ ఫ్యాన్స్ ఇంకా ఇంకా సెట్స్ వేసుకుంటూ భారీ షెడ్యూల్స్ పెడుతూ షూటింగ్ చేస్తున్నారు. అసలు #NTRNeel షూటింగ్ ఎప్పటికి ఫినిష్ అయ్యి ఎప్పుడు రిలీజ్ అంటారో అనే టెన్షన్ లో ఎన్టీఆర్ ఫ్యాన్స్ కనిపిస్తున్నారు. 

NTR Fans Go Berserk in Bangalore:

NTR In Bengaluru Inaugurated KIMS Amidst Huge Fan Gathering

Tags:   NTR
Advertisement



Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ