ప్రస్తుతం టాలీవుడ్ లో రెండు ప్రముఖ కుటుంబాలలో పెళ్లిళ్లు జరిగాయి. ఈ రెండు పెళ్లిళ్లకు అక్కినేని ఫ్యామిలీ నుంచి దగ్గుబాటి ఫ్యామిలీ వరకు, మెగా ఫ్యామిలీ నుంచి బాలయ్య వరకు హాజరయ్యారు. హీరో విజయ్ దేవరకొండ-రష్మికలు, అల్లు శిరీష్-నయానిక ల వెడ్డింగ్ సెలెబ్రేషన్స్ మార్చ్ మొదటి వారంలో హైదరాబాద్ లో అంగరంగ వైభవంగా జరగగా...
ఈ పెళ్లి సెలెబ్రేషన్స్ లో టాలీవుడ్ ప్రముఖులు చాలామంది పాల్గొన్నప్పటికీ.. ప్రముఖ పాన్ ఇండియా హీరోస్ జూనియర్ ఎన్టీఆర్, ప్రభాస్ లు కనిపించకపోవడం హాట్ టాపిక్ అయ్యింది. అల్లు శిరీష్ వివాహానికి తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి దగ్గరనుంచి ఏపీ మినిస్టర్ నారా లోకేష్, అలాగే టాలీవుడ్ సినీ ప్రముఖులు పాల్గొన్నారు.
అటు విజయ్ దేవరకొండ-రష్మిల వెడ్డింగ్ రిసెప్షన్ లోను మెగాస్టార్ ఫ్యామిలీ నుంచి నాగార్జున ఫ్యామిలీ, మహేష్ ఫ్యామిలీ, అల్లు ఫ్యామిలీ వెంకీ ఇలా అందరూ పాల్గొన్నారు. కానీ ఎన్టీఆర్, ప్రభాస్ లు కనిపించలేదు. ఎన్టీఆర్.. నీల్ మూవీ షూటింగ్ లో ఉన్నారా, ప్రభాస్ హైదరాబాద్ లోనే రెండు మూడు సినిమా షూటింగ్స్ లో ఉన్నారు.
మరి వారిద్దరూ టాలీవుడ్ లో జరిగిన హై ప్రొఫైల్ పెళ్లిళ్లలో కనిపించకపోవడం పై అభిమానుల్లో కాస్త అసంతృప్తి తొణికిసలాడింది.




రిటైర్మెంట్ తర్వాత వ్యవసాయం చేసే సెలబ్రిటీలు
Loading..