సినిమా గ్లామర్ ప్రపంచానికి దూరంగా ప్రశాంతమైన ప్రకృతి ఒడిలో వ్యవసాయం చేయాలని భావించే సెలబ్రిటీల సంఖ్య ఇప్పుడు పెరుగుతోంది. ఇప్పటికే కొందరు ఫామ్ హౌస్‌లలో సేంద్రీయ వ్యవసాయం చేస్తూ ఆదర్శంగా నిలుస్తున్నారు. డబ్బున్న ధనవంతులంతా సంపాదించింది చాలని వ్యవసాయంపై మక్కువ చూపిస్తున్నారు. సమాజానికి దూరంగా ఓ పదెకరాలు పొలంలో వ్యవసాయం చేయాలని ఆశపడుతున్నారు. సినిమాల తర్వాత వ్యవసాయం చేసే సెలబ్రిటీలు ఎవరు? అంటే..
ప్రకాష్ రాజ్ ఇప్పటికే పూర్తిస్థాయిలో వ్యవసాయం చేస్తున్నారు. నటుడిగా కొనసాగుతూనే ఖాళీ సమయంలో పొలానికి వెళ్తుంటారు. మైసూర్ సమీపంలో ఆయనకు పెద్ద ఫామ్ హౌస్ ఉంది. అక్కడ ఆయన స్వయంగా చెట్లకు నీళ్లు పోయడం, పంటలు పండించడం చేస్తారు. ప్రకృతితో గడపడం తననో గొప్ప రిలాక్సేషన్ గా భావిస్తారు. అలాగే పవన్ కళ్యాణ్ కి వ్యవసాయం అంటే ప్రాణం. ఆయనకు హైదరాబాద్ శివార్లలో ఒక తోట సినిమాల నుండి విరామం దొరికినప్పుడల్లా ఆయన అక్కడే గడుపుతారు.
మామిడి తోటలు, ఆవుల సంరక్షణ ఆయనకు ఇష్టమైన పనులు. రాజకీయాల్లో బిజీగా ఉన్నప్పటికీ, భవిష్యత్తులో పూర్తిస్థాయిలో ప్రకృతి వ్యవసాయం చేయాలనేది ఆయన కోరిక. బాలీవుడ్ స్టార్ సల్మాన్ ఖాన్ కు పన్వేల్‌లో భారీ ఫామ్ హౌస్ ఉంది. లాక్ డౌన్ సమయంలో ఆయన స్వయంగా ట్రాక్టర్ నడపడం, వరి నాట్లు వేయడం వంటి వీడియోలు అప్పట్లో వైరల్ అయ్యాయి. నటుడిగా రిటైర్ అయిన తర్వాత శేష జీవితంలో వ్యవసాయమే చేయాలనుకుంటున్నారు.
నటుడు మాధవన్ పర్యావరణ ప్రేమికుడు. తమిళనాడులోని పళని సమీపంలో నిస్సారంగా ఉన్న ఒక భూమిని కొనుగోలు చేసి, దానిని పచ్చని తోటగా మార్చారు. ఆధునిక సాంకేతికతను ఉపయోగించి తక్కువ నీటితో ఎక్కువ దిగుబడి సాధించే పద్ధతులను ఆయన ప్రోత్సహిస్తున్నారు. పీపుల్స్ స్టార్ ఆర్. నారాయణ మూర్తి జీవితమే ఒక సాదాసీదా రైతు జీవితంలా ఉంటుంది. ఆయనకు విలాసవంతమైన జీవితం కంటే పొలం గట్ల మీద తిరగడమే ఇష్టం.




విజయ్ ను అల్లాడిస్తున్న భార్య సంగీత 
Loading..