Advertisementt

అల్లు శిరీష్ పెళ్లిలో స్పెష‌ల్ సెల‌బ్రిటీ

Sat 07th Mar 2026 09:01 AM
allu sirish  అల్లు శిరీష్ పెళ్లిలో స్పెష‌ల్ సెల‌బ్రిటీ
Revanth Reddy Attends Allu Sirish Wedding అల్లు శిరీష్ పెళ్లిలో స్పెష‌ల్ సెల‌బ్రిటీ
Advertisement
Ads by CJ

అల్లు శిరీష్ - నైనిక రెడ్డిల వివాహ వేడుక 6 మార్చి 2026న హైదరాబాద్‌లో అత్యంత వైభవంగా జరిగింది. సినీ, రాజకీయ, వ్యాపార రంగాల ప్రముఖులు భారీగా తరలివచ్చిన ఈ వేడుకలో ఒక అపురూప దృశ్యం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.

ఈ పెళ్లిలో తెలంగాణ ముఖ్య‌మంత్రి రేవంత్ రెడ్డి ఆగ‌మ‌నం ప్ర‌త్యేక చ‌ర్చ‌కు తావిచ్చింది. సీఎం రేవంత్ రెడ్డి ఎంతో ఆప్యాయంగా కొత్త జంట‌ను ఆశీర్వ‌దించారు.. అలాగే ఆయ‌న పెళ్లి కొడుకు సోద‌రుడు, స్టార్ హీరో అల్లు అర్జున్ తోను ముచ్చ‌టిస్తూ క‌నిపించ‌డం ఇప్పుడు ఇరు తెలుగు రాష్ట్రాల్లో చ‌ర్చ‌గా మారింది.

అయితే ఐకాన్ స్టార్ అల్లు అర్జున్  సంధ్య థియేట‌ర్ ఇష్యూ ను కూడా మ‌ర్చిపోయి సీఎం రేవంత్ రెడ్డి ఇలా పెళ్లికి వ‌చ్చి నూత‌న దంప‌తులను ఆశీర్వ‌దించ‌డం ఆస‌క్తిక‌ర చ‌ర్చ‌కు తావిచ్చింది. అల్లు అర‌వింద్, అల్లు అర్జున్, శిరీష్ వారి కుటుంబీకుల‌తో కాసేపు రేవంత్ స‌ర‌దాగా స‌మ‌యం గ‌డ‌ప‌డం నిజంగా చూప‌రుల‌ను ఆక‌ర్షించింది. తెలుగు సాంప్ర‌దాయంలో వివాదాల‌తో సంబంధం లేకుండా పెళ్లి వేడుక‌ల‌కు విచ్చేసి నూత‌న దంప‌తుల‌ను ఆశీర్వ‌దించ‌డం గొప్ప విశేషంగా మారుతుంది. కొన్నిసార్లు బంధాల‌ను క‌ల‌ప‌డానికి పెళ్లివేడుక అనేది కీల‌కంగా మారుతుంది.

Revanth Reddy Attends Allu Sirish Wedding:

CM Revanth Reddy Attends Allu Sirish and Nayanika Grand Wedding

Tags:   ALLU SIRISH
Advertisement



Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ