Advertisementt

స‌హ‌నంలో మేటి ఈ స్టార్ హీరోయిన్

Sat 07th Mar 2026 10:18 AM
katrina kaif  స‌హ‌నంలో మేటి ఈ స్టార్ హీరోయిన్
Katrina Kaif స‌హ‌నంలో మేటి ఈ స్టార్ హీరోయిన్
Advertisement
Ads by CJ

బాలీవుడ్ స్టార్ హీరోయిన్ కత్రినా కైఫ్ కెరీర్ ప్రారంభం నుండి నేటి వరకు ఎన్నో ఒడిదుడుకులను ఎదుర్కొని తనకంటూ ఒక ప్రత్యేక గుర్తింపు తెచ్చుకుంది. తాజాగా సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న ఒక పాత ఇంటర్వ్యూ క్లిప్ చూస్తుంటే, ఆమె ఈ స్థాయికి చేరుకోవడానికి ఎంతటి సహనాన్ని ప్రదర్శించిందో అర్థమవుతోంది. ఈ వీడియోలో కత్రినా తన సహనటులైన అమీర్ ఖాన్, షారుఖ్ ఖాన్ , సల్మాన్ ఖాన్‌లతో కలిసి కనిపిస్తోంది. వారు ఆమెపై కొన్ని వ్యంగ్య వ్యాఖ్యలు చేసినా కానీ.. కత్రినా ఏమాత్రం తడబడకుండా చాలా హుందాగా, చురుకైన సమాధానాలతో వారిని ఎదుర్కోవడం నెటిజన్లను ఆకట్టుకుంటోంది.

వైరల్ అవుతున్న ఈ ఫుటేజీలో స్టార్ హీరోలు కత్రినాను సరదాగా ఎగతాళి చేస్తున్నట్లు కనిపిస్తోంది. అయితే ఆ వ్యాఖ్యలు ఒక్కోసారి హద్దులు దాటినట్లు అనిపించినా.. ఆమె మాత్రం ఏమాత్రం అసహనం ప్రదర్శించలేదు. చాలా ప్రశాంతంగా, ఆత్మవిశ్వాసంతో కూడిన ఆమె ప్రతిస్పందనలు నెటిజన్ల ప్రశంసలు అందుకుంటున్నాయి. ఒక ఇంటర్వ్యూలో అంతటి ఒత్తిడి మధ్య కూడా తన హుందాతనాన్ని కోల్పోకుండా సంభాషణను స్మార్ట్‌గా నడిపించిన తీరుకు అభిమానులు ఫిదా అవుతున్నారు.

ఈ వీడియో బయటకు వచ్చిన తర్వాత సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున చర్చ మొదలైంది. ముఖ్యంగా వీడియోలో హీరోల ప్రవర్తనపై నెటిజన్లు విమర్శలు గుప్పిస్తున్నారు. ఒక హీరోయిన్ విష‌యంలో అంతటి పేరున్న నటులు అంత చులకన భావంతో మాట్లాడటం సరికాదని చాలామంది అభిప్రాయపడుతున్నారు. బహిరంగంగా కెమెరాల ముందే ఇలాంటి వ్యాఖ్యలు ఎదురవుతుంటే.. ఇక తెర వెనుక హీరోయిన్ల పరిస్థితి ఎలా ఉంటుందో అని నెటిజన్లు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. మహిళా నటుల పట్ల పరిశ్రమలో ఉండే ధోరణిపై ఇది మళ్లీ చర్చను లేవనెత్తింది.

ఒక వినియోగదారు స్పందిస్తూ.. కత్రినా తన కెరీర్ పొడవునా ఇలాంటి ఎన్ని పరిస్థితులను ఎదుర్కొని ఉంటుందో ఈ క్లిప్ చూస్తే అర్థమవుతుంది! అని రాశారు. ఆమె నటనపై విమర్శలు ఉండవచ్చు కానీ.. ఇండస్ట్రీలో నిలదొక్కుకోవడానికి ఆమె ప్రదర్శించిన వ్యక్తిత్వం, సహనం మాత్రం సాటిలేనివని కొనియాడారు. మరికొందరు నెటిజన్లు ఈ చర్చలో రణబీర్ కపూర్ పేరును కూడా ప్రస్తావిస్తూ.. బహిరంగ వేదికలపై తోటి నటీమణుల పట్ల నటులు ప్రవర్తించే తీరును ప్రశ్నిస్తున్నారు.

Katrina Kaif:

Bollywood Actress Katrina Kaif

Tags:   KATRINA KAIF
Advertisement



Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ