వరలక్ష్మి శరత్ కుమార్ పరిచయం అవసరం లేని పేరు. నటిగా తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపును దక్కించుకుని పరిశ్రమలో కొనసాగుతోంది. తమిళ సినిమాలతో పాటు తెలుగు సినిమాల్లోనూ నటిస్తూ తనదైన ముద్ర వేసింది. విలనీగానూ తనకంటూ ప్రత్యేకత చాటి చెప్పిన నటి. స్టార్ హీరోల చిత్రాల్లో కీలక పాత్రలు పోషిస్తూ మరింత దగ్గరైంది. అయితే వరలక్ష్మి నటి అవ్వడం తండ్రికి ఎంత మాత్రం ఇష్టం లేదన్న విషయం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది.
ఈ విషయాన్ని శరత్ కుమార్ సతీమణి రాధిక తెలిపారు. వరలక్ష్మి సినిమాల్లోకి వెళ్తానంటే శరత్ కుమార్ వద్దని వారించారుట. ఇండస్ట్రీలో తన అనుభవాలు సహా, ఎదురయ్యే సవాళ్లను వివరించి సినిమా రంగం వద్దు మరో వృత్తిలో స్థిరపడమని సలహా ఇచ్చారుట. దీంతో వరలక్ష్మి డాడ్ ముందు ఏం మాట్లాడలేకపోయింది. తన ఫ్యాషన్ ప్రపంచం గురించి ఓపెన్ గా చెప్పలేకపోయింది. ఆ విషయాలన్నింటి రాధిక ముందు ఓ సందర్భంలో వరలక్ష్మి ఉంచిందిట.
ఆ తర్వాత రాధిక-వరలక్ష్మి తల్లి శరత్ కుమార్ ని కలిసి సంయుక్తంగా ఒప్పించినట్లు రాధిక తెలిపారు. వరలక్ష్మి తొలి సినిమా చూడగానే తను గొప్ప నటి అవుతుందని చెప్పడంతో పాటు, తెలుగు సినిమాలపై కూడా దృష్టి పెట్టమని సలహా ఇచ్చినట్లు రాధిక తెలిపారు. తెలుగు ప్రేక్షకులకు నచ్చితే నటుల్ని , సినిమాను ఎంతగా ఆదరిస్తారు అన్నది తనకు తెలిసునని చెప్పుకొచ్చారు. వరలక్ష్మి `సరస్వతి` సినిమాతో దర్శకురాలిగా మారడం ఎంతో సంతోషాన్నిచ్చే విషయం అన్నారు.




క్రేజీగా సూర్య విశ్వనాధ్ అండ్ సన్స్ 

Loading..